By: ABP Desam | Updated at : 17 Feb 2022 11:50 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
సమంత (ఫైల్ ఫొటో)
Arabic Kuthu: ‘ఇళయ దళపతి’ విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న ‘బీస్ట్’ (Beast) సినిమా నుంచి ‘అరబిక్ కుత్తు’ పాట విడుదల అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar) కంపోజ్ చేసిన పాట విడుదల అయిన మూడు గంటల్లోనే ఏకంగా 43 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మొదటి రోజే ఈ పాటకు 23 మిలియన్లకు పైగా వ్యూస్, 2.2 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి.
ఈ పాటకు సమంత (Samantha) వేసిన స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. ‘మరో లేట్ నైట్ ఫ్లైట్... కాదు! ఈరోజు రాత్రికి నా రిథమ్ #HalamithiHabibo. ఈ పాట అదిరిపోయింది.’ అంటూ క్యాప్షన్ వచ్చింది. ఈ వీడియోకు కేవలం గంటలోనే 1 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. ఈ పాట కింద ప్రముఖ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ, శిల్పారెడ్డి, దంగల్ భామ సాన్యా మల్హోత్రా, హీరోయిన్ సంయుక్త హెగ్దే వంటి సెలబ్రిటీలు కూడా కామెంట్ చేశారు.
ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. డాక్టర్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.కేజీయఫ్: చాప్టర్ 2తో ఈ సినిమా పోటీ పడనుంది. ఇక సమంత ప్రస్తుతం యశోద అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది. త్వరలో మరిన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించనుందని తెలుస్తోంది.
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులపై ఫిర్యాదు !
CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?
NSE Co-location Scam: ఎన్ఎస్ఈ స్కామ్లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు