Samantha Action Scenes : నో డూప్, నో రోప్స్ - సమంత యాక్షన్ రియల్
'యశోద' కోసం సమంత స్టంట్ సీన్స్ చేశారు. అయితే... వాటి కోసం రోప్స్, వైర్స్ వాడలేదట. అంతా రియల్‌గా చేశారట.
'యశోద' (Yashoda Movie) సినిమా కోసం సమంత (Samantha) యాక్షన్ సీన్స్ చేశారు. ఇంతకు ముందు నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఆవిడ యాక్షన్, ఫైట్ సీన్స్ చేశారు. అయితే... వాటికి, 'యశోద'లో సీన్స్‌కు కొంచెం వ్యాత్యాసం ఉంది. అది ఏమిటంటే... 'యశోద'లో హార్డ్ కోర్ యాక్షన్ ఉంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో స్టంట్ సీన్స్ ఉన్నాయి. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అయితే... ఇక్కడ మేటర్ ఏంటంటే ఆ సీన్స్ అన్నీ సమంత రియల్‌గా చేశారు. డూప్ వాడలేదు. అలాగని, రోప్స్ కూడా వాడలేదు.
Samantha Action Scenes Making Video : 'యశోద' సినిమా నవంబర్ 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు. అందులో యాక్షన్ సీన్స్ గురించి, సమంత డెడికేషన్ గురించి స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ చెప్పుకొచ్చారు.
Hollywood Action choreographer Yannick Ben On Samantha : ''సమంత ఎంతో డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారీ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మేం (యాక్షన్ డైరెక్టర్స్) కోరుకునేది అదే! అందుకని, ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది'' అని యానిక్ బెన్ తెలిపారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు ఆయన వర్క్ చేశారు. అందులో స్టంట్స్ ఆయనే కొరియోగ్రఫీ చేశారు. సమంత స్టంట్స్‌కు కూడా! ఇప్పుడీ 'యశోద' సమంత, యానిక్ బెన్‌కు సెకండ్ ప్రాజెక్ట్.
'యశోద'లో స్టంట్స్ గురించి యానిక్ బెన్ మాట్లాడుతూ ''యాక్షన్ రియల్‌గా ఉండటం నాకిష్టం. 'యశోద'లో స్టంట్స్, యాక్షన్ కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్... 'యశోద' యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి'' అని తెలిపారు. యాక్షన్ సీన్ చేసే ముందు సమంతకు అది ఎలా ఉంటుందో చూపించిన తర్వాత ఆమెతో చేశారట. అందువల్ల, నటీనటులకు టైమింగ్ తెలియడంతో ఎటువంటి సమస్య ఉండదని యానిక్ బెన్ వివరించారు. రోప్స్, డూప్ అసలు వాడలేదని... యాక్షన్ అంతా సమంత చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అదీ సంగతి!
View this post on Instagram
హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు 'ఇన్సెప్షన్', 'డంకర్క్'తో పాటు 'ట్రాన్స్‌పోర్టర్ 3', 'ప్రాజెక్ట్ 7', 'ప్యారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్', 'సిటీ హంటర్' సినిమాలకు యానిక్ బెన్ వర్క్ చేశారు. హిందీలో షారుఖ్ ఖాన్ 'రయీస్', సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై', తెలుగులో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాలకూ స్టంట్స్ కంపోజ్ చేశారు.
Also Read : సమంతకు అక్కినేని ఫ్యామిలీ నుంచి మద్దతు
View this post on Instagram
హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.