Salaar Movie Review Live Updates - 'సలార్' లైవ్ అప్డేట్స్: ప్రభాస్ సినిమా ప్రత్యేకతలు ఏంటి? - లైవ్ రివ్యూ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి
Salaar review live updates: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 2023లో ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూసిన చిత్రమిది. ఈ సినిమా రివ్యూ, లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

Background
Salaar Movie Release Review Live Updates: భారతీయ సినిమా బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా 'సలార్'. ఇందులో ప్రముఖ మలయాళ కథానాయకుడు, దర్శక నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్ జోడీగా అగ్ర కథానాయిక, లోక నాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ నటించారు.
ప్రభాస్ అభిమానులకు క్రిస్మస్, న్యూ ఇయర్ ముందుగా మొదలు!
Salaar release hungama: 'సలార్' విడుదల అవుతున్న థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ముంబైలో ఓ థియేటర్ దగ్గర 150 అడుగుల ఎత్తున్న కటౌట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ థియేటర్ల దగ్గర హడావిడి చూస్తుంటే... అభిమానులకు క్రిస్మస్ & న్యూ ఇయర్ ముందుగా వచ్చాయని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా రివ్యూ, లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
'కెజియఫ్ 2' తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి...
'సలార్' సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. కన్నడ కథానాయకుడు యశ్ పాన్ ఇండియా స్టార్ కావడం వెనుక కారణమైన 'కెజియఫ్', 'కెజియఫ్ 2' చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆ రెండు సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ కన్నడ నిర్మాత విజయ్ కిరగుందూర్ ఈ 'సలార్'ను కూడా నిర్మించారు.
'సలార్' విడుదలకు ముందు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అయితే... ఆ ప్రభావం ఈ సినిమా మీద పడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్, ఆ టికెట్ సేల్స్ చూస్తుంటే భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తోంది.
'సలార్' సినిమాకు, 'కెజియఫ్'కు లింక్ ఉందని మొదట నుంచి ప్రచారం జరిగింది. అయితే... అందులో నిజం లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు అని, తనకు సినిమాటిక్ యూనివర్స్ తీసేంత స్థాయి లేదన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే... 'ఉగ్రం' రీమేక్ అంటూ జరిగిన ప్రచారాన్ని తొలుత ఖండించినప్పటికీ, విడుదల దగ్గర పడిన తరుణంలో నిజమేనని ఆయన అంగీకరించారు. 'కెజియఫ్' తరహాలో 'ఉగ్రం' కథను తీశామని ఆయన పేర్కొన్నారు.
Salaar Cast and Crew Names: 'సలార్' సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. ఆ సినిమాలో ఆమెది ముస్లిం పాత్ర అయితే... ఈ సినిమాలో హిందూ పాత్ర. రెండిటిలో ఆమె ఉండటంతో, రెండు సినిమాల మధ్య లింక్ ఉందని ప్రచారం జరిగింది. ఇక... రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు హీరో జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, టినూ ఆనంద్, కన్నడ నటుడు మధు గురుస్వామి నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
Salaar Review Telugu Live Updates: ప్రభాస్ అభిమానులకు టికెట్స్ ఇచ్చిన నిఖిల్
హైదరాబాద్ శ్రీ రాములు థియేటర్లో ఒంటి గంటకు 'సలార్' స్పెషల్ ప్రీమియర్ షో వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకి నిఖిల్ 100 టికెట్లు తీసుకున్నారు. ప్రభాస్ వీరాభిమానులకు ఇచ్చారు. వాళ్ళను కలిసి టికెట్లతో పాటు ఫోటోలు కూడా ఇచ్చారు.
Loved meeting and giving away these #Salaar Movie 1 am midnight show tickets to these guys who were some of the Most DieHard fans of #Prabhas bhai..
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 21, 2023
more power to our Telugu & Indian cinema 🔥 #SalaarCeaseFire https://t.co/FIqoZOycfB pic.twitter.com/XSIuSBD7lt
Salaar review live updates: బాహుబలి రికార్డులు బీట్ చేస్తుందా? లేదా?
ప్రేక్షకులందరూ ఇప్పుడు ఎదురు చూసే విషయం ఒకటే! బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను సలార్ మూవీ బ్రేక్ చేస్తుందా? లేదా? అని! దర్శక ధీరుడు రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రభాస్ ఆ స్థాయి విజయం అందుకోలేదు. కానీ ప్రెసెంట్ అడ్వాన్స్ సేల్స్ బుకింగ్ ట్రైన్ చూస్తుంటే బాహుబలి 2 రికార్డులు చాలా ఏరియాలలో బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.





















