By: ABP Desam | Updated at : 21 Jan 2023 11:09 PM (IST)
అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో త్వరలో స్ట్రీమ్ కానున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించనున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ షోకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆహా గతంలోనే విడుదల చేసింది. అయితే ఈ గ్లింప్స్‌లో స్ట్రీమింగ్ డేట్‌ను వెల్లడించలేదు.
త్వరలో దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కానుంది. రిలీజ్ డేట్ క్లారిటీ కూడా ప్రోమోలోనే వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ తరహాలో రెండు భాగాల్లో విడుదల చేస్తారా, లేకపోతే ఒక్క భాగమేనా అన్న సంగతి తెలియరాలేదు.
ఈ షోకు సంబంధించిన గ్లింప్స్‌లో కేవలం ఒకట్రెండు ప్రశ్నలను మాత్రమే రివీల్ చేశారు. ‘నన్ను బాలా అనే పిలవాలి.’ అని బాలకృష్ణ అనగా ‘నేను ఓడిపోవడానికైనా సిద్ధం కానీ అలా పిలవడానికి...’ అని పవన్ కళ్యాణ్ అంటుండగా కట్ చేశారు.
‘మీ అన్నయ్య చిరంజీవిలో నీకు నచ్చిన, నచ్చని క్వాలిటీస్ ఏంటి?’ అని కూడా నందమూరి బాలకృష్ణ అడిగారు. కానీ దానికి పవన్ చెప్పిన ఆన్సర్ రివీల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయాలనుకున్నప్పుడు తన వదినతో మాట్లాడిన మూమెంట్స్‌ను కూడా ఆయన రివీల్ చేశారు. ఆ సమయంలో తన వదినతో కాల్ మాట్లాడాను అని పవర్ స్టార్ చెప్పారు. అయితే ఏం మాట్లాడారో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
ఈ మధ్య రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ విమర్శల తీవ్రతను పెంచడంపై కూడా బాలయ్య ఒక ప్రశ్న అడిగారు. ఈ మధ్య వాడి, వేడి డబుల్ ఇంపాక్ట్ అయిందని బాలకృష్ణ అనగా... దానికి పవన్ కళ్యాణ్ కామెడీగా ‘లేదండీ.. నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండీ.’ అన్నారు.
రాష్ట్రంలో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ, ఆ ప్రేమ ఓట్ల రూపంలో ఎందుకు కనిపించడం లేదు అని కూడా బాలయ్య అడిగారు. ‘మేం బ్యాడ్ బాయ్స్ 1 2 3 4 5 6 7 8 9 10.’ అని నందమూరి బాలకృష్ణ చెప్పడంతో ఈ గ్లింప్స్ ముగిసింది. అయితే ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో ఇంకా తెలపలేదు. అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కు ఇది ఆఖరి ఎపిసోడ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
గ్లింప్స్‌ను బట్టి చూస్తే కొన్ని వివాదాస్పద విషయాలను కూడా బాలయ్య టచ్ చేసినట్లు అనిపించింది. మరి ఎపిసోడ్‌లో ఎంతవరకు వివాదాస్పద అంశాలు ఉంటాయో చూడాలి. అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో ప్రభాస్ ఎపిసోడ్ ఇప్పటికే స్ట్రీమ్ అవుతుంది. ప్రభాస్, గోపిచంద్‌ల ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను కూడా రెండు ముక్కలు చేస్తారా లేదా ఒక్కటే పార్ట్ రానుందా అన్నది తెలియాల్సి ఉంది.
రెండు సీజన్లు పూర్తి అయిపోయాక కూడా ఇంకా అన్‌స్టాపబుల్ షోలో ఇప్పటివరకు కనిపించని సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. హీరోల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ ఇలా పెద్ద లిస్టే ఉంది. వీరిని తర్వాతి సీజన్లకు అయినా పిలుస్తారేమో చూడాలి.
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?
Upcoming Movies This Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!
Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?
Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!