అన్వేషించండి

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రంగి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. “రుద్రంగి నాది” అంటూ జగ్గూభాయ్ చెప్పిన పవరు ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. ఆ తర్వాత నెమ్మదిగా నెగెటివ్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటిస్తున్న ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కన్నడ హీరోయిన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మమత మోహన్ దాస్,  ఆశిష్ గాంధీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

View this post on Instagram
 
A post shared by Mamta Mohandas (@mamtamohan)

తాజాగా ‘రుద్రంగి’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో బండి చక్రంతో శత్రువులపై విరుచుకుపడుతూ  జగపతి బాబు కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ చూడని రీతిలో జగపతి బాబు లుక్ కనిపిస్తున్నది.  ‘రుద్రంగి నాది బాంచత్’ అంటూ అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఒళ్లు జలదరింపు కలిగించేలా ఉంది.  దొరల కాలం నాటి పరిస్థితులను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ దొర(భీమ్ రావ్ దొర) పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి చాలా మంది హీరోలు మొదట తమ కెరీర్ ను విలన్ పాత్రలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోలుగా టర్న్ అయ్యారు. అలా వచ్చిన చాలా మంది ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. జగపతి బాబు విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తొలుత హీరోగా మంచి సినిమాలు చేశారు. ఫ్యామిలీ కమ్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి. యంగ్ హీరోలతో గట్టి పోటీ ఎదురయ్యింది. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో విలన్ పాత్రలు చేయాలి అనుకున్నాడు. తొలిసారి ‘లెజెండ్’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం అనిపించింది. గతంలో ఎప్పుడూ చూడని జగపతి బాబు ఈ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత’ సినిమాల్లోనూ విలన్ గా నట విశ్వరూపం చూపించాడు. అటు తమిళంలోనూ పలు సనిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు నెగెటివ్ రోల్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తున్నది.

Also read: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget