అన్వేషించండి

RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి 2’ తర్వాత ‘RRR’ అరుదైన ఘనత దక్కించుకోబోతోంది. ఈ సినిమాను లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌ లో ప్రదర్శించబోతున్నారు.

Royal Albert Hall presents RRR Live Concert : లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌ గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 148 సంవత్సరాల ఘనత కలిగిన ఈ థియేటర్ లో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలు ప్రదర్శించారు. వీటిలో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి.  ఈ థియేటర్ లో ప్రదర్శించబడిన తొలి ఇంగ్లీషేతర మూవీగా ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆక్టోబర్ 19, 2019లో ఈ సినిమాను ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌ లో ప్రదర్శించారు.

‘బాహుబలి 2’ తర్వాత ‘RRR’

‘బాహుబలి 2’ సినిమాను ప్రదర్శించిన  5 సంవత్సరాల తర్వాత..  రాజమౌళి దర్శకత్వం వహించిన మరో చిత్రం  ‘RRR’ కూడా ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన యాక్షన్ డ్రామాను మే11, 2025న రాయల్ ఆల్బర్ట్ హాల్‌ లో ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.  ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ లైవ్ ఫిల్మ్ ఇన్ కాన్సర్ట్ లో ప్రతిష్టాత్మక రాయల్ ఫిల్‌ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా ప్రదర్శన ఇవ్వబోతున్నారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

‘RRR’ సినిమా గురించి..

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన  ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా మంచి వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ సహా పలువురు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 25, 2022న  విడుదలైంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డీవీవీ  దానయ్య నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఏకంగా రూ. 1,120 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ‘నాటు నాటు’ పాట గ్లోబల్ చార్ట్‌ బస్టర్ గా నిలిచింది. ప్రపంచం అంతా ఈ పాటకు చిందేసింది. అంతేకాదు,  95వ అకాడమీ అవార్డ్స్‌ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ గా ఆస్కార్ అవార్డును అందుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్స్ స‌హా ప‌లు అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను దక్కించుకుంది.  

జపాన్ లో ‘RRR’ సినిమా  స్పెషల్ క్రేజ్

‘RRR’ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఈ సినిమాకు ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమాను పలు దేశాల్లో రీ రిలీజ్ చేశారు. జపాన్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ‘RRR’ సినిమాను ప్రమోట్ చేసారు. ఈ సినిమా విడుదల తర్వాత ఆ దేశంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళికి స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.  

 

Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kanguva Movie: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
Free Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
Embed widget