RRR Film: అదరగొడుతున్న RRR - ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కిన ‘RRR’ సరికొత్త రికార్డులు సాధిస్తోంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం నామినేష్లను దక్కించుకుంది. రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ అయ్యింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ RRR. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా దేశ, విదేశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డుల కోసం పోటీ పడుతోంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రెండు విభాగాల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. RRR ఈ అరుదైన ఘనత దక్కించుకోవడం పట్ల భారతీయ సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘RRR’ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ లో ‘RRR’ సత్తా
⦿ భారతీయ సినిమా పరిశ్రమ నుంచి గత రెండు దశాబ్దాలుగా ఏ సినిమా గోల్డెన్ గ్లోబ్ కు అవార్డులకు నామినేట్ కాలేదు.
⦿ RRR కంటే ముందు ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ అనే సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేట్ అయ్యింది.
⦿ మీరా నాయర్ దర్శకత్వం వహించిన ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ 2001లో విడుదల అయ్యింది.
⦿ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, లలిత్ దూబే, షఫాలీ షా, వసుంధర దాస్ కీలక పాత్రల్లో నటించారు.
⦿ ఈ చిత్రం పలు విభాగాల్లో గోల్డెన్ లయన్, ఇండిపెండెంట్ స్పిరిట్ ప్రొడ్యూసర్స్ అవార్డు, జీ సినీ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్, బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిలిమ్ అవార్డ్, బాలీవుడ్ మూవీ అవార్డులు అందుకుంది.
⦿ ‘RRR’ సినిమా ఐకానిక్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన మూడో భారతీయ సినిమాగా నిలిచింది.
⦿ ఇండియా నుంచి ఈ అవార్డుకు నామినేట్ అయిన తొలి సినిమా ‘దో ఆంఖే బారా హాత్’. వి.శాంతారాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1957లో విడుదల అయ్యింది.
⦿ ‘దో ఆంఖే బారా హాత్’ సినిమాలో వి.శాంతారాం, సంధ్య, బాబూరావ్ పెందర్కర్, ఉల్హాస్, బిఎం వ్యాస్ కీలక పాత్రల్లో నటించారు. దీన్ని హిందీ క్లాసిక్ సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.
⦿ ‘దో ఆంఖే బారా హాత్’ 8వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గెల్డెన్ బేర్ అవార్డును అందుకుంది. అటు శామ్యూల్ గోల్డ్ విన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.
⦿ ‘RRR’ సినిమా ఈ ఐకానిక్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ చేయబడిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది.
⦿ టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది.
⦿ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ చేయబడిన మొట్టమొదటి భారతీయ పాటగా ‘నాటు నాటు’ ఖ్యాతి దక్కించుకుంది.
Thanks to the jury at @goldenglobes for nominating #RRRMovie in two categories. Congratulations to the entire team…
— rajamouli ss (@ssrajamouli) December 12, 2022
Thanks to all the fans and audience for your unconditional love and support through out. 🤗🤗🤗
Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు