By: ABP Desam | Updated at : 14 Mar 2022 07:19 PM (IST)
'ఎత్తర జెండా' సాంగ్ వచ్చేసిందోచ్
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాను ముందుగా జనవరి 7న విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మార్చి 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమాలో పాటలన్నీ విడుదల చేశారు. ఎండ్ టైటిల్స్ కోసం ఓ పాటను డిజైన్ చేశారు. అదే 'ఎత్తర జెండా'.
నిజానికి ఈ పాటను ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా ఉంచాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాపై హైప్ పెంచడానికి రిలీజ్ కి ముందే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్ పోస్టర్, ప్రోమోని విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూర్తి సాంగ్ ని విడుదల చేస్తామని చెప్పారు కానీ టెక్నికల్ ఇష్యూ కారణంగా వాయిదా వేశారు.
ఇప్పుడు సాంగ్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంతి, హారిక నారాయణ్ కలిసి పాడారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం 'డాల్బీ సినిమా' టెక్నాలజీను వాడబోతున్నారు. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలవబోతుంది.
నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్