Rise Of Ram Song: RRR నుంచి ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్.. ఈ పాటను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్!
RRR సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. ‘Rise Of Ram’ పేరుతో విడుదలైన ఈ పాట వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
![Rise Of Ram Song: RRR నుంచి ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్.. ఈ పాటను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్! Rise Of Ram From RRR Movie: Raamam Raaghavam Song Released Rise Of Ram Song: RRR నుంచి ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్.. ఈ పాటను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/31/99b1acdc7827a02b5e9d96da5fb60ec7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న RRR సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. జనవరి 7న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. RRR టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియా ద్వారా సినిమా గురించి అప్‌డేట్స్ ఇస్తూ.. మరింత ఊరిస్తున్నారు. తాజాగా RRRలోని రామ్ పోషిస్తున్న అల్లూరి సీతారామారాజు పాత్రను హైలెట్ చేస్తూ.. శుక్రవారం ‘రైజ్ ఆఫ్ రామ్’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను వింటే మీకు తప్పకుండా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
ఇటీవలే ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ.. ‘రైజ్ ఆఫ్ భీమ్’ పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఇద్దరు వీరులు కలిసి బ్రిటీష్ పాలకులను ఎదిరిస్తే.. ఎలా ఉంటుందనే కల్పిత కథతో తెరకెక్కిన కథే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సుమారు రూ.600 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
Also Read: ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ భేటీ వాయిదా !
2021కు వీడ్కోలు చెబుతూ.. శుక్రవారం ‘రైజ్ ఆఫ్ రామ్’ పాటను విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని కీర్తిస్తూ రాసిన ఈ పాటను వినేకొద్ది వినాలనిపిస్తుంది. శివ శక్తి దత్త సంస్కృతంలో రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ తదితరులు ఆలపించారు.
Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: 'గాలోడు' టీజర్.. సుడిగాలి సుధీర్ మాస్ అవతార్..
Also Read: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పిందిగా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)