అన్వేషించండి

MAA Election: 'మా' ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు.. అలా జరిగితే కోర్టుకు వెళ్తామన్న ఎన్నికల అధికారి

మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే రిగ్గింగ్ జరిగిందంనే.. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

'మా' ఎన్నిక ఫైట్ చివరి దశకు చేరింది. అయితే పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు ప్యానెల్ స‌భ్యులు పోలింగ్ ప్రాంతంలో తెగ హ‌డావుడి చేస్తున్నారు. ఓ ప్యానల్ వారు రిగ్గింగ్ జ‌రుగుతుంద‌ని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ఎన్నికలను నిలిపి వేశారు.  

రిగ్గింగ్ జ‌రిగింద‌ని తేలితే త‌దుప‌రి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెబుతున్నారు.  ఫ‌లితాలు కూడా నిలిపివేస్తామని చెప్పారు. మా ఎన్నికల వ్యవహారంపై కోర్టకు వెళతామని ఎన్నికల అధికారి అన్నారు. రిగ్గింగ్ జ‌రిగే అవ‌కాశం లేద‌ని, కార్డ్ ఉంటేనే ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని క‌రాటే క‌ళ్యాణి చెబుతుంది. మరోవైపు 'మా' పోలింగ్ కేంద్రంలో గొడవ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తానంటూ బెనర్జీనికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రకాశం రాజ్ పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారని విష్ణు వర్గం ఆరోపించింది. ఈ కారణంగా రెండు ప్యానల్స్ మధ్య గొడవ చోటుచేసుకుంది.

నటులు శివారెడ్డి, సమీర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. శివారెడ్డి న‌మూనా బ్యాలెట్ ల‌ను పంచుతున్నారంటూ విష్ణు వ‌ర్గం ప్రకాశ్ రాజ్ వ‌ర్గానికి చెందిన వారిపైకి దూసుకు వెళ్లింది. మాటా మాటా పెరిగింది. 

ఎన్నికల అధికారులు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల్ని పిలిపించారు. రెండు బృందాలతో చర్చించి..రిగ్గింగ్ జరిగినట్టు తేలితే ఫలితాలు ప్రకటించకుండా కోర్టుకు వెళ్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.  ఇప్పటి వరకూ 30 శాతం పోలింగ్ నమోదైంది.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో మొత్తం 925మంది సభ్యులు ఉన్నారు. 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500లకు పైగా సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్‌ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ కో-ఆపరేటివ్‌ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో  పోలింగ్‌ను నిర్వహిస్త్తున్నారు. ఎన్నికలకు 50మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8గంటల తర్వాత 'మా' అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.

 ఉదయమే.. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్. అయితే నిన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వాళ్లు.. ఇవాళ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.  అంతకుముందు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు కరచాలనం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌.. మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు.. విష్ణుతో ప్రకాశ్‌రాజ్‌కు కరచాలనం చేయించారు. తర్వాత విష్ణు-ప్రకాశ్‌రాజ్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Embed widget