By: ABP Desam | Updated at : 02 Dec 2022 11:19 AM (IST)
Edited By: Mani kumar
Siger Revanth
సింగర్‌గా యావత్ భారతావని మెప్పుపొందాడు రేవంత్. ఇప్పుడు ఆయన ‘బిగ్ బాస్’లో కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘బిగ్ బాస్’ సీజన్-6 టైటిల్ కోసం చాలా శ్రమిస్తున్నాడు. రేవంత్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేప్పుడు అతడి భార్య అన్విత ప్రెగ్నెంట్‌గా ఉన్నారనే సంగతి తెలిసిందే. గురువారం (01.11.2022) ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రేవంత్ ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి.
అయితే, రేవంత్‌కు తాను తండ్రయ్యాడనే విషయం ఇంకా ‘బిగ్ బాస్’ చెప్పినట్లు లేదు. రానున్న ఎపిసోడ్‌లో అది చూపించే అవకాశం ఉంది. రేవంత్ బిగ్ బాస్ కు వచ్చినప్పుడే అన్విత నిండు గర్భిణి. భార్యను వదిలి బిగ్ బాస్ కి వచ్చానని రేవంత్ కొన్ని సందర్బాల్లో బాధపడ్డాడు కూడా. ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమెకు సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూస్తూ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.
అన్విత ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో రేవంత్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంతం చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. చిన్పప్పటి నుంచి తండ్రి లేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తున్నానని హౌస్ లో ఓ సందర్భంలో చెప్పి ఎమోషనల్ అయ్యాడు రేవంత్. ఇప్పుడు పాప పుట్టిందని తెలిస్తే రేవంత్ ఆనందానికి అవధులు ఉండవంటున్నారు ఫ్యాన్స్. రేవంత్ కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు రేవంత్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రేవంత్ శ్రీకాకుళంలో పుట్టాడు. విశాఖపట్నంలో పెరిగాడు. రేవంత్ కుటుంబంలో ఎవరికీ సంగీత నేపథ్యం లేదు. కానీ పాటలపై ఉన్న ఇష్టంతో డిగ్రీ మధ్యలో వదిలేసి హైదరాబాద్ వెళ్లాడు. తెలుగు సినిమాల్లో అనేక పాటలు పాడాడు రేవంత్. ‘బాహుబలి’ లో ‘మనోహరి..’ లాంటి పాటలు ఆయనకు మరింత గుర్తింపు తెచ్చాయి. దాదాపు 200 లకు పైగా పాటలు పాడాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఉన్న రేవంత్ తనదైన ఆటతో అందరితో ఆకట్టుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్ లో ఈ సీజన్ విన్నర్ అవ్వడానికి అవకాశాలు బానే ఉన్నా.. ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా రావడంతో అతని గెలుపుపై సందేహం కూడా కలుగుతుంది. ఒక్కో సారి రేవంత్ కోపంలో మాట్లాడే మాటలు తనకే నష్టం కలిగిస్తాయని తెలుసుకోలేకపోతున్నాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని చాకచక్యంగా గేమ్ ఆడితే ఈసారి టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయం అని తెలస్తోంది. మరోవైపు రేవంత్ కే టైటిల్ విన్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరా అనిది తెలియాలంటే చివరివరకూ వేచి చూడాల్సిందే.
Also Read : వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?
Kailash Kher Attacked: కర్నాటకలో గాయకుడు కైలాష్ ఖేర్‌కు చేదు అనుభవం, వాటర్ బాటిళ్లతో దాడి
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?
Janaki Kalaganaledu January 30th: తోపుడు బండి మీద వ్యాపారం మొదలుపెట్టిన రామా- అవమానించిన కన్నబాబు, బుద్ధి చెప్పిన జానకి
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే
Budget 2023: సుకన్య సమృద్ధికి బడ్జెట్లో బూస్ట్ - అలాంటి వారికీ ఛాన్స్ ఇస్తారట!