అన్వేషించండి

RC16 టైటిల్ లీక్, అల్లు అరవింద్ ఊహించని నిర్ణయం - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి ఊహించని టైటిల్, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈరోజు నుంచి మార్చి 19 వరకు సుమారు ఐదు రోజుల పాటు వైజాగ్ లో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ జరగనుంది. వైజాగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చరణ్ తన తదుపరి ప్రాజెక్టు లాంచింగ్ కోసం హైదరాబాద్ రానున్నాడు. 'గేమ్ చేంజర్' తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆస్పత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌ - బిగ్‌బికి ఆ సర్జరీ!
బాలీవుడ్‌ బిగ్‌బి, మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హాస్పిటల్‌లో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన ఆస్వస్థకు గురవడంతో హుటాహుటిన ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో టైట్‌ సెక్యూరిటీ మధ్య ఆయనను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసినట్టు బాలీవుడ్‌ మీడియాలో వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం ఆయన ఈ రోజు ఉదయం కోకిలాబెన్‌ ఆస్పత్రిలో ఆయనకు యాంజియోప్లాస్టి సర్జరీ జరిగినట్టు సమాచారం. ఆయనకు శ్వాస ఆడకపోవటంతో ఆసుపత్రికి చేర్చినట్లు కుటుంబ సభ్యులు మీడియాతో పేర్కొన్నారట. ఈ విషయం తెలిసి బిగ్‌బి ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన సారా అలీ ఖాన్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌ 'మర్డర్‌ ముబారక్‌'
ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తాయి. ప్రతీ శుక్రవారం నయా అప్‌డేట్స్‌తో ఓటీటీలు సిద్ధమవుతాయి. అయితే ఈవారం మాత్రం ఆడియన్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు డబుల్‌ డజన్ సినిమాలు వచ్చేసాయి. అందులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, రొమాంటిక్‌ క్రైం థ్రిల్లర్‌ వంటి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేసాయి. అందులో స్టార్‌ కిడ్‌ సారా అలి ఖాన్‌ లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ 'మర్డర్‌ ముబారక్‌' ఒకటి. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్‌ సీరిస్‌ నేడు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. అర్థరాత్రి నుంచే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

తంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?
తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజల నేపథ్యంలో చిత్రాలకు ప్రేక్షకాదరణ బావుంటోంది. 'మసూద', 'విరూపాక్ష' వంటివి భారీ విజయాలు సాధించాయి. ఆ జానర్ సినిమా 'తంత్ర' థియేటర్లలో విడుదలైంది. 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాల ఫేమ్ అనన్యా నాగళ్ల నటించడం, ప్రచార చిత్రాల్లో దృశ్యాలు సినిమాపై అంచనాలు పెంచాయి. మరి, ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది? భయపెడుతుందా? లేదా? అనేది రివ్యూ చూసి తెలుసుకోండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం? ఇరకాటంలో సాయిపల్లవి, రణబీర్‌ల ‘రామాయణం’ మూవీ
నితీష్ తివారీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సినిమా ‘రామాయణం’. మూడు పార్ట్ లుగా ఈ సినిమా వ‌స్తుంద‌ని మొద‌టి నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అఫీషియ‌ల్ గా ఎప్పుడూ బ‌య‌టికి చెప్పరు మేక‌ర్స్. సినిమాకి సంబంధించి పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ర‌ణ్ బీర్ క‌పూర్ రాముడిగా, సాయి ప‌ల్ల‌వి సీత‌గా న‌టిస్తుంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. సినిమా ప్రొడ్యూస‌ర్లు ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Embed widget