News
News
X

This Week Releases: థియేటర్లలో, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతున్న సినిమాలు

చూడాలే గానీ... ఈ వారం ప్రేక్షకులకు పండగే! ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో డిఫరెంట్ జానర్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల జాబితా ఇది!

FOLLOW US: 

'మ‌హాన్‌'లో గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాకు ఫాద‌ర్ అండ్ స‌న్ సెంటిమెంట్ తోడుంది.  ఇది ఓటీటీ సినిమా అయితే... థియేటర్లలోకి వస్తున్న 'ఖిలాడి'లో రవితేజ డ్యూయల్ రోల్ ఉంది. అది స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామానే. 'డీజే టిల్లు', 'సెహరి' సినిమాలో యూత్‌ఫుల్ ఫన్ అండ్ రొమాన్స్ ఉన్నాయి. 'మళ్ళీ మొదలైంది' రొమాంటిక్ ఎంటరైనర్. చూడాలే గానీ... ఈ వారం ప్రేక్షకులకు పండగే! ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో డిఫరెంట్ జానర్ సినిమాలు ఉన్నాయి. అవి ఏంటో చూడండి.

మద్యపాన నిషేధం... తండ్రీ కొడుకుల యుద్ధం!
సినిమా: మహాన్
హీరో హీరోయిన్లు: విక్రమ్, ధృవ్ విక్రమ్, సిమ్రాన్
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
విడుదల తేదీ: ఫిబ్రవరి 10 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)

చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన సినిమా 'మహాన్'. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. తండ్రి ఆశయ సాధన కోసం మద్యపాన నిషేధ పోరాటాన్ని ముందు ఉండి నడిపిస్తాడని ఆశిస్తే... గాంధీ పేరుతో ఊరంతా సారా సప్లై చేసే ఓ మద్యపాన నిషేధ పోరాట వీరుడి కుమారుడిగా విక్రమ్ కనిపించనున్నారు. అతని కుమారుడిగా ధృవ్ విక్రమ్ నటించారు. తండ్రికి కుమారుడు ఎదురు తిరిగితే? ఎదిరిస్తే? అనే కథాంశంతో సినిమా రూపొందింది. 'ఏపీ మందు సామ్రాజ్యనికి మహారాజు నా బాబు' అని ధృవ్ విక్రమ్, 'ఒరేయ్ నా కొడకా! ఇప్పుడు నీ బాబు, అప్పుడు గాంధీ మహాన్ పేరు పెట్టుకున్న కామర్స్ టీచర్ కాదు' అని విక్రమ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 

రవితేజ ఆట ఎవరితో?
సినిమా: ఖిలాడి
హీరో హీరోయిన్లు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి
దర్శకత్వం: రమేష్ వర్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 11 (థియేటర్లలో )

'ఖిలాడి'గా మాస్ మహారాజ రవితేజ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ వారం విడుదలవుతున్న పెద్ద సినిమా ఇదే. 'ప్లే స్మార్ట్'... అనేది సినిమా కాప్షన్. ఆల్రెడీ రిలీజైన టీజర్‌లో స్టయిలిష్ లుక్‌లో, జైల్లో ఖైదీగా రవితేజ కనిపించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా సినిమాలో ఉన్నారు. 'ఖిలాడి'గా ఎవరితో రవితేజ ఆట ఆడారన్నది ఆసక్తికరం.

చెల్లితో పెళ్లి... అక్కతో ప్రేమ!
సినిమా: సెహరి
హీరో హీరోయిన్లు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి
దర్శకత్వం: జ్ఞానసాగర్‌ ద్వారక
విడుదల తేదీ: ఫిబ్రవరి 11 (థియేటర్లలో)

చెల్లితో పెళ్లికి రెడీ అయిన ఓ యువకుడు ఆమె అక్కతోనే ప్రేమలో పడ్డాడు! ఆ తర్వాత ఏం జరిగింది? ఏమైంది? అనేది 'సెహరి' సినిమాలో చూడాలి. రవితేజ 'ఖిలాడి'తో పాటు ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలవుతున్న చిత్రమిది. ఆల్రెడీ రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు యూత్‌ఫుల్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే ఫీలింగ్ ఇచ్చాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  

విడాకుల తర్వాత... భార్య తరఫున వాదించిన న్యాయవాదితో ప్రేమలో పడితే?
సినిమా: మళ్ళీ మొదలైంది
హీరో హీరోయిన్లు: సుమంత్, నైనా గంగూలీ, వర్షిణీ సౌందర్ రాజన్
దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్
విడుదల తేదీ: ఫిబ్రవరి 11 (జీ 5 ఓటీటీలో)

విడాకుల తర్వాత తన భార్య తరఫున వాదించిన న్యాయవాదితో భర్త ప్రేమలో పడితే? అసలు, అతడు ఎందుకు విడాకులు తీసుకున్నాడు? ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది? అనేది 'మళ్ళీ మొదలైంది' సినిమా కాన్సెప్ట్. ఆల్రెడీ రిలీజైన టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. సుమంత్ హీరోగా, అతడి నుంచి విడాకులు తీసుకున్న అమ్మాయిగా వర్షిణీ, లాయర్ పాత్రలో నైనా నటించారు. విడుదల తర్వాత కూడా జీవితం ఉందనే కథాంశంతో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తీశారట.

రూ. 200 కోట్ల గుడ్డుకు... హైదరాబాదీ గృహిణికి సంబంధం ఏంటి?
సినిమా: భామా కలాపం
ప్రధాన తారాగణం: ప్రియమణి, జాన్ విజ‌య్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌ తదితరులు
దర్శకత్వం: అభిమన్యు తాడి షో రన్నర్: భరత్ కమ్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 11 (ఆహా ఓటీటీలో)

కోల్‌క‌తాలోని ఓ మ్యూజియంలోని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన రూ. 200 కోట్లు గుడ్డు మిస్ అవుతుంది. దానికి, హైదరాబాద్‌లో ఓ హౌస్ వైఫ్‌కు సంబంధం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన ఒరిజినల్ వెబ్ సినిమా 'భామా కలాపం'. యూట్యూబ్ కోసం కుకింగ్ వీడియోస్ చేసే హౌస్ వైఫ్ అనుపమగా ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు. 

రాధిక ఎవర్ని ప్రేమించింది?
సినిమా: డీజే టిల్లు
హీరో హీరోయిన్లు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి
దర్శకత్వం: విమల్ కృష్ణ
విడుదల తేదీ: ఫిబ్రవరి 12 (థియేటర్లలో)

అనగనగా ఓ అమ్మాయి... పేరు రాధికా ఆప్తే. బార్ సింగర్. ఆమెను డీజే టిల్లు ప్రేమిస్తాడు. అయితే... రాధిక ఎవర్ని ప్రేమించింది? అతడితో కంటే ముందు రెండు మూడ్లుసార్లు ఆమె ఏం ట్రై చేసింది? అనేది థియేటర్లలో చూడాలి. 'డీజే టిల్లు' ట్రైలర్, టైటిల్ సాంగ్ యూత్‌ను అట్ట్రాక్ట్ చేశాయి.

దీపికా పదుకోన్, 'గల్లీ బాయ్' ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఒరిజినల్ మూవీ 'గెహ్రాహియా'. అమెజాన్ ఓటీటీలో ఫిబ్రవరి 11న డైరెక్టుగా విడుదలవుతోంది. మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా  కథానాయకుడిగా పరిచయమైన 'హీరో' సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ నెల 11న విడుదల కానుంది. 

Published at : 07 Feb 2022 11:41 AM (IST) Tags: khiladi DJ Tillu Gehraiyaan BhamaKalapam Mahaan Malli Modalaindhi February Second Week 2022 Tollywood Releases Telugu Movies Releasing In February Second Week

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల