Raveena Tandon: రక్తంతో రాసిన లెటర్, అశ్లీల చిత్రాలు ఇంటికి పంపేవాడు: రవీనా టాండన్
ఓ అభిమాని రక్తంతో రాసిన లెటర్ లను తన ఇంటికి కొరియర్ ద్వారా పంపేవాడని. వాటితో పాటు బ్లడ్ వయల్స్, అశ్లీల చిత్రాలను కూడా కొరియర్ చేసేవాడని తెలిపింది రవీనా.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో రవీనా ఒకరు. 90ల్లో అప్పటి కుర్రకారుకు డ్రీమ్ హీరోయిన్ గా రవీనాకు భలే క్రేజ్ లభించింది. అప్పట్లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉండేది. అందం, అభినయంతో రవీనా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెండో ఇన్నింగ్స్‌లోనూ రవీనా తన సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన KGF-2లో రవీనా అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో కొంతమంది మితిమీరిన అభిమానం వలన తాను కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డానని తెలిపారు.
రక్తంతో లెటర్, అశ్లీల చిత్రాలు పంపేవాడు :
రవీనా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ఆమె మాట్లల్లో... ‘‘ఓ అభిమాని రక్తంతో రాసిన లెటర్ లను మా ఇంటికి కొరియర్ ద్వారా పంపేవాడు. వాటితో పాటు అశ్లీల చిత్రాలను కూడా కొరియర్ చేసేవాడు. ఆ సమయంలో అతడి పిచ్చి చూసి నాకు ఎంతో భయం వేసేది. ఓ రోజు నేను.. భర్త, పిల్లలతో కలసి కారులో వెళ్తుండగా రాయి వేశాడు. దాంతో భయం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటివి జరిగినప్పుడు నాకు ఎంతో బాధ కలిగేది. ఓ రోజైతే ఏ వ్యక్తం ఏకంగా తన ఇంటి ముందే కూర్చుని నా కోసం ఎదురు చూసేవాడు. రోజులు గడుస్తున్నా అతడు అక్కడి నుంచి కదిలేవాడు కాదు. దీంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చింది’’ అని రవీనా టాండన్ తెలిపారు.
నేచర్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం:
‘‘నాకు ఫోటో గ్రఫీ అంటే చాలా ఇష్టమం. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నాకు ఇష్టమైన ఫోటోగ్రఫీ కి కూడా ఎక్కువ సమయం కేటాయించేదాన్ని. నేను తీసిన ఫోటోలు ఎగ్జిబిషన్ లలో, ఆర్ట్ గ్యాలరీల్లో కూడా ప్రదర్శించేవారు. నేచురల్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. నేను తీసిన కొన్ని ఫోటోలు ముంబై లోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ లోనూ ప్రదర్శించేవారు’’ అని రవీనా తెలిపారు. ఇటీవలే రవీనా తన భర్త అనిల్ తో కలసి బంధావ్ ఘర్ నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. రవీనా.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటున్నారు. తన కెమెరాలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉంటున్నారు రవీనా.
Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!
కేజీఎఫ్ 2 లో నటనతో సౌత్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు రవీనా. ప్రస్తుతం ఆమె అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'పట్నా శుక్లా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.