Rashmika Mandanna Lifestyle : లగ్జరీ బ్రాండ్స్ అండ్ కాస్ట్లీ కార్స్.. రష్మిక రిచ్ మెయింటెనెన్స్!
రష్మిక లైఫ్ స్టైల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయడానికి హీరో హీరోయిన్లు కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా సంపాదించిన మొత్తాన్ని పలు సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే హీరోయిన్లు మాత్రం తమ సంపాదనలో ఎక్కువ మొత్తం తమ మెయింటెనెన్స్ కోసమే ఉపయోగిస్తుంటారు. హీరోయిన్లు బయటకు వచ్చారంటే.. వాళ్లు వేసుకునే బట్టల దగ్గర నుండి హెయిర్ పిన్ వరకు అన్నీ గమనిస్తుంటారు ఫ్యాన్స్. అందుకే ప్రతీ విషయంలో పెర్ఫెక్ట్ ఉండాలని దానికి తగ్గట్లే ఖర్చు పెడుతుంటారు.
ఉదాహరణగా రష్మికను తీసుకుంటే.. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్కో సినిమాకి దగ్గర దగ్గరగా కోటి ఛార్జ్ చేస్తోంది. ఈ కోట్ల సంపాదనను ఓ వైపు పెట్టుబడులుగా పెడుతూనే.. మరోవైపు ఖర్చులు, లగ్జరీల కోసం కోట్లు వెచ్చిస్తోంది. రష్మిక లైఫ్ స్టైల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె దగ్గర మూడు లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ఒకటి ఆడి క్యూ3 కాగా.. మెర్సిడెజ్ బెంజ్ సి క్లాస్ మరొకటి. వీటితో పాటు రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. ఇవి కాకుండా ఇన్నోవా, హ్యుండయ్ క్రెటా కార్లు కూడా రష్మిక దగ్గర ఉన్నాయి. సందర్భానికి తగ్గట్లు ఆమె తన కార్లను వాడుతుంటుంది.
రష్మికకు ఫ్యామిలీ బిజినెస్ లు ఉన్నాయి. తన సంపాదనలో కొంత భాగాన్ని అందులో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇవి కాకుండా గత నెల ఆమె ముంబైలో ఓ ఖరీదైన అందమైన ఇల్లుని కొనుగోలు చేసింది. ఈ మధ్యకాలంలో ఆమెకి హిందీ సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ముంబైకి వెళ్లిన ప్రతీసారి హోటల్స్ లో బస చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడే ఓ ఇల్లు కొనేసింది. ఈ ఇంటితో పాటు బెంగుళూరులో ఆమె బంగ్లాలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో ఓ పెద్ద విల్లా ఉంది. దీని రేటు దాదాపుగా ఆరు నుండి ఎనిమిది కోట్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఆమెకి ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
ఇక ఆమె మెయింటైనెన్స్ విషయానికొస్తే.. లగ్జరీ కార్లతో పాటు, కాస్ట్లీ యాక్ససరీస్ వాడుతుంటుంది. ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు లక్ష నుండి మూడు లక్షల వరకు ఉంటాయని సమాచారం. చెప్పుల కోసం కూడా లక్షల్లో ఖర్చు చేస్తుందట. రకరకాల బూట్లు, హీల్స్ ఎప్పటికప్పుడు కొంటూ ఉంటుంది. గాగుల్స్, వాచ్ లు ఇలా అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్సే వాడుతుంటుంది. ఇక ఆమె వార్డ్ రోబ్ గనుక చూస్తే అన్నీ కాస్ట్లీ బ్రాండ్ బట్టలే కనిపిస్తాయి. వీటి కోసం నెలకి లక్షల్లో ఖర్చు చేస్తుందట. సినిమాల్లోకి రాకముందు కూడా ఆమె సంపన్న కుటుంబానికి చెందినది కావడంతో.. సంపాదించడం మొదలుపెట్టాక మరింత రిచ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో 'పుష్ప' అనే సినిమాలో నటిస్తోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలానే శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లో అయితే ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేసింది.