Ram Gopal Varma: వర్మ నుంచి ఎమోషనల్ పోస్ట్ - ఎవరూ ఊహించి ఉండరు
ఈరోజు మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. ఎవరైనా వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటారు కానీ వర్మ మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. తరచూ ఏదోక విషయంపై కామెంట్స్ చేస్తూ వివాదాల్లో నిలుస్తుంటారు. బంధాలకు, అనుబంధాలకు దూరంగా ఉంటానని చెప్పే వర్మ..రియాలిటీలో మాత్రం సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈరోజు మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. వారితో ఉన్న అనుభూతులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వర్మ కూడా తన తల్లిని ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ వర్మ ఇప్పటివరకు చేసిన ట్వీట్స్ తో పోలిస్తే కాస్త స్పెషల్ అనే చెప్పాలి.
'హ్యాపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి' అంటూ తన తల్లితో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇక ఆర్జీవీ ఏ ఫొటోలోనైనా గ్లాస్ పట్టుకొని కనిపించడం కామనే కదా.. తన తల్లితో షేర్ చేసిన ఫొటోలో కూడా అలానే కనిపించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటవల వర్మ డైరెక్ట్ చేసిన 'డేంజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆడియన్స్ ను అలరించలేకపోయింది.
Happy Mother’s Day Mom, I am not as good as a son but u are more than good as a mother 💐💐🙏 pic.twitter.com/uZ7E9ngeMy
— Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2022
View this post on Instagram