అన్వేషించండి

PK VS RGV: పవన్ కళ్యాణ్ Vs ఆర్జీవీ: ‘పాపం పసివాడు’ సినిమాతో పొలిటికల్ కౌంటర్స్!

పవన్ కల్యాణ్ మీద మరోసారి తీవ్ర విమర్శలు చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హత లేదంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

దర్శకుడు రాంగోపాల్ వర్మ, జనసేన అధినేత, సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ జగన్ ను విమర్శిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ కు ఆర్జీవీ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా పవన్ కు లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ ట్వీట్

ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌ ను షేర్ చేస్తూ, ఈ సినిమా ఎవరైనా ఆంధ్ర ముఖ్యమంత్రితో తీస్తే బాగుంటుందన్నారు. “మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఎవరైనా ‘పాపం పసివాడు’ సినిమా తీస్తారని అశిస్తున్నాను. ఆయన చాలా ఇన్నోసెంట్. ఎలాంటి కల్లాకటపం ఎరుగని వ్యక్తి. చిన్న సవరణ, ఆయన చేతిలో ఉన్న ఒక్క సూట్‌ కేస్ కాకుండా, అక్రమ సంపాదన కోసం ఓపెన్ చేసిన  సూట్‌కేస్ కంపెనీలన్నింటినీ పెట్టాలి. డియర్ ఏపీ సీఎం..  నువ్వు  కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాదు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. అక్రమ సంపాదనను కూడగట్టి, జనాల మధ్య గొడవలు సృష్టించే నీకు క్లాస్ వార్ అనే పదాన్ని పలికే హక్కులేదు. మీ నుంచి, మీ గ్రూప్ నుంచి ఏదో ఒకరోజు రాయలసీమ విముక్తి పొందుతుందని భావిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. “ఈ కథకు రాజస్థాన్‌ ఎడారిలోని ఇసుక తిన్నెలు అవసరం. కానీ, ఏపీలోని నదుల నుంచి వైసీపీ దోచుకున్న ఇసుక దిబ్బలు జగన్ తో సినిమా చేయడానికి సరిపోతాయి” అంటూ విమర్శలు గుప్పించారు.

పవన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ

పవన్ కల్యాట్ ట్వీట్ పై అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.  పవన్ ట్వీట్ మాదిరిగానే గట్టి కౌంటర్ ఇచ్చారు. “నీతో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, మీరు అజ్ఞానంతో నిండిన అమాయకుడు. అమాయకత్వం నిండిన కల్లాకటపం లేని మనిషి. ఇక్కడ  ఒక మార్పు ఇక్కడ అవసరం: ఒక పాత్రను పోషించే బదులు మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్‌ను కలిగి ఉన్న క్యారెక్టర్లను చేయండి.  సీఎం కావాలని కోరుకోని ప్రియమైన పవన్ కల్యాణ్, నువ్వు ఎన్టీ రామారావు కాదు. ఎంజీఆర్ కాదు. మీ అవగాహనాలేమి, మీ అభిమానులపై మీరు ప్రేరేపించే హింస నేపథ్యంలో ప్రజాసేవ  అనే పదాన్ని పలికే అర్హతే లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ సైకోపాతిక్ నార్సిజం నుంచి మీ జనసైనికులు బయటపడుతారని భావిస్తున్నాను” అంటూ కౌంటర్ ఇచ్చారు.  ప్రస్తుతం పవన్, ఆర్జీవీ ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ మద్దతుదారులు అర్జీవీకి సపోర్టుగా పవన్ పై విరుచుకుపడుతున్నారు. అటు జనసేన మద్దతుదారులు పవన్ కు సపోర్టుగా ఆర్జీవీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  

Read Also: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget