2018 Movie: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!
రీసెంట్ గా విడుదలైన మలయాళీ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. రూ.15 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. త్వరలో తెలుగులో విడుదలకు రెడీ అవుతోంది.
జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘2018'. కేవలం రూ.15 కోట్లతో రూపొందించిన ఈ మలయాళం సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మలయాళీ బాక్సాఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ‘2018’
వాస్తవానికి మలయాళీ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి. తక్కువ బడ్జెట్ మంచి కాన్సెప్ట్ తో సినిమాలు రూపొందించడంలో మాలీవుడ్ మేకర్స్ కు మంచి పేరుంది. అక్కడ మంచి సక్సెస్ అందుకున్న సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని వేరే భాషల్లోకి రీమేక్ చేస్తుంటారు. తెలుగులోనూ పలు మలయాళీ రీమేక్ సినిమాలు వచ్చాయి. అద్భుత విజయాలను అందుకున్నాయి. మలయాళంలో తెరకెక్కిన సినిమాలు మంచి గుర్తింపు పొందినా, కలెక్షన్లను వసూళ్లు చేయడంలో మాత్రం ముందుండలేకపోతున్నాయి. తాజాగా మలయాళంలో విడుదలైన ‘2018’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది.
#2018Movie Promo!
— Tovino Thomas (@ttovino) May 13, 2023
Running successfully in theatres Worldwide! #Blockbuster pic.twitter.com/kecsTVazUb
కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సాధారణంగా ఈ స్థాయి రికార్డు పాన్ ఇండియా మూవీస్‌కే ఉంటుంది. అయితే, ఈ మూవీ కేవలం మలయాళంలోనే విడుదలైంది. కేరళలోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు కలెక్షన్లు అందుకోవడం.. అదీ 10 రోజుల్లోనే కావడం సంచలనం కలిగిస్తోంది. మలయాళంలో ఇప్పటి వరకు రూ.100 కోట్లు సాధించిన సినిమాలు ‘లూసిఫర్’, ‘కురుప్’. అవీ ఫుల్ రన్ లో రూ. 100 కోట్లు వసూలు చేశాయి. కానీ, ‘2018’ మాత్రం కేవలం 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతుంది. ఈ కలెక్షన్స్ రెండు, మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.
త్వరలో తెలుగు సహా పలు భాషల్లోకి విడుదల
కేరళలో అద్భుతం విజయం అందుకున్న ఈ సినిమా త్వరలో తెలుగులోకి విడుదలకానుంది. అటు హిందీ, కన్నడ, తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ‘2018’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2018లో కేరళలో భారీగా వరదలు వచ్చాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నాటి విపత్తును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు అనే కథాంధంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
View this post on Instagram
Read Also: అదిరిపోయే యాక్షన్ సీన్లతో వచ్చేస్తున్న 'ఎక్స్‌ట్రాక్షన్ 2' - ట్రైలర్ వచ్చేసింది చూశారా?