News
News
వీడియోలు ఆటలు
X

రామ్ చరణ్, కాజల్‌తో ‘మెరుపు’ సినిమా - మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాల్లో షూటింగ్ ప్రాంభించి, తర్వాత ఆగిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో ‘మెరుపు’ ఒకటి. ఆ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..

FOLLOW US: 
Share:

సినిమా రంగంలో కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య మొదలవుతాయి. వాటి గురించి పబ్లిసిటీ కూడా చేస్తారు. కానీ ఎందుకో ఆ తర్వాత ఆ సినిమాలు ఉన్నట్టుండి ఆగిపోతాయి. తర్వాత వాటి పేరు కూడా ఎక్కడా వినిపించదు. అవి ఆగిపోవడానికి కూడా కారణాలు ఏంటో ప్రేక్షకులకు తెలీదు. ఇది కేవలం చిన్న సినిమాల విషయంలోనే కాదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మొదటి సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ పై మాస్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రామ్ చరణ్ విషయంలో కూడా కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి ఆగిపోయినవి ఉన్నాయట. అలాంటి సినిమాల్లో ‘మెరుపు’ ఒకటి. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయమే అయినా.. చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది. 

టాలీవుడ్ లో సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలదొక్కుకున్నవారు కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగానే ఇండస్ట్రీకి వచ్చినా అనతి కాలంలోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత ‘మగధీర’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ ‘ఆరెంజ్’ సినిమాలో నటించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనా.. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆర్థికంగా కూడా ఈ సినిమా నిర్మాతలను ముంచేసింది. ఓ సరికొత్త లవ్ స్టోరీతో రూపొందించిన ఈ మూవీ ఎందుకో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది.

ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ‘మెరుపు’ అనే సినిమాను ఓకే చేశారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా సినిమాను నిలిపివేశారట దర్శకనిర్మాతలు. దానికి తోడు ‘ఆరెంజ్’ సినిమా ప్రభావం ఈ మూవీ పైన కూడా ఉంటుందేమోనని దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గినట్టు సమాచారం. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ ఉంటుందట. ఫైనాన్షియల్ కారణాల వలన ‘మెరుపు’ సినిమాను నిలిపివేశారట. తర్వాత అంతా ఈ సినిమా గురించి మర్చిపోయారు. 

రామ్ చరణ్ కు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడం ఎంతో ఇష్టమట. అలాంటి మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారట ఆయన. అందుకే ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తీసి హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరితో స్పోర్ట్ నేపథ్యంలో ఓ సినిమాకు ఓకే చేశారట రామ్ చరణ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఆయన ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో ‘ఆర్ సి 15’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేస్తారని టాక్.  

 Read Also: బేబీ జాక్వెలిన్, నిన్నుచాలా మిస్ అవుతున్నా! జైలు నుంచి సుకేష్ మరో ప్రేమలేఖ!

Published at : 26 Mar 2023 04:55 PM (IST) Tags: Ramcharan Birthday Ram Charan Ram Charan Movies TOLLYWOOD Merupu Happy Birthday Ramcharan Ram Charan Merupu

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?