అన్వేషించండి

RC15: న్యూజిలాండ్‌కు చరణ్ పయనం - ఒక్క పాట కోసం రూ.8 కోట్ల బడ్జెట్!

నవంబర్ మొదటివారంలో RC15 సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు.   

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ శంకర్ 'ఇండియన్2' సినిమాను టేకప్ చేయడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతుంది.

Ram Charan and Kiara to head to New Zealand: నవంబర్ మొదటివారంలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. దీనికోసం టీమ్ మొత్తం న్యూజిలాండ్ కి వెళ్లబోతుంది. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీలపై పాటను చిత్రీకరించనున్నారు. దాదాపు పదిరోజుల పాటు ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. న్యూజిలాండ్ లో రకరకాల ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. నిజానికి మొదట బడ్జెట్ అనుకున్నప్పుడు శంకర్ ఈ పాట గురించి చెప్పలేదట. 

ఇప్పుడు ఈ ఒక్క పాట కోసం దిల్ రాజు అదనంగా రూ.8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలు ఎంత లావిష్ గా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలు హిట్ అయినా.. అవ్వకపోయినా.. పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. విజువల్స్ వండర్స్ గా నిలుస్తుంటాయి. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా కొన్ని పాటలను అలానే ప్లాన్ చేశారు శంకర్. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ దాటిపోయింది. దిల్ రాజు ఎప్పటిలానే ఈ సినిమాకి కూడా ఒక పర్టిక్యులర్ బడ్జెట్ అనుకున్నారు. కానీ శంకర్ తో అలా లెక్కలేసుకుంటే కుదరదు కదా..! సినిమా యాభై శాతం షూటింగ్ పూర్తి కాకుండానే అనుకున్న బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని దిల్ రాజు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 

ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి టైటిల్ గా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సినిమా మొదలైన కొత్తలో 'విశ్వంభర' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత 'సర్కారోడు', 'ఆఫీసర్' ఇలా చాలా టైటిల్స్ వినిపించాయి. రీసెంట్ గా 'అధికారి' అనే టైటిల్ ను ఖాయం చేశారని అన్నారు. ఇప్పుడు 'సిటిజెన్' అనే మరో పేరు వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేవరకు ఈ టైటిల్ లిస్ట్ పెరుగుతూనే ఉండేలా ఉంది. దీంతో అభిమానులు త్వరగా టైటిల్ అనౌన్స్ చేయమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Also Read: పూర్ణకు పెళ్లయిపోయిందట, అందుకే ఎవరినీ పిలవలేకపోయానని చెప్పిన ముద్దుగుమ్మ!

టాప్ హెడ్ లైన్స్

Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Rajamouli : సూర్యతో రాజమౌళి నెక్స్ట్ మూవీ? - భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడేనా!
సూర్యతో రాజమౌళి నెక్స్ట్ మూవీ? - భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget