(Source: ECI/ABP News/ABP Majha)
Raju Yadav Lyrical Song: అమ్మాయి రాస్తాలోకి ‘రాజు యాదవ్‘- లిరికల్ సాంగ్ తో అదరగొట్టేశాడంతే!
Raju Yadav Lyrical Song: ‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా, అంకిత ఖారత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజు యాదవ్‘. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Raju Yadav Chudu Lyrical Song: తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన గెటప్ శ్రీను, హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజు యాదవ్’ సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి కీలక అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
ఆకట్టుకుంటున్న ‘రాజు యాదవ్‘ రిలికల్ సాంగ్
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘రాజు యాదవ్ చూడు’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ సాహిత్యం, రామ్ మిర్యాల గానం, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందరినీ అలరిస్తోంది. అమ్మాయి ప్రేమ కోసం రాజు యాదవ్ పడే తపనను ఈ పాటలో చూపించారు. ఓ మధ్య తరగతి యువకుడైన రాజు యాదవ్(గెటప్ శ్రీను) ఓ రిచ్ గర్ల్ ప్రేమను పొందేందుకు ఆమె వెంట తిరగడం ఈ పాటలో కనిపిస్తోంది. వినసొంపైన పాట, అంతకు మించి అద్భుతమైన విజువలైజేషన్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. హీరోయిన్ అకింత ఖరత్ స్క్రీన్ ప్రజన్స్ బాగా ఆకట్టుకుంటోంది.
సినిమాపై అంచనాలు పెంచిన టీజర్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కమెడియన్ బ్రహ్మానందం వాయిస్ తో మొదలైన ఈ టీజర్ లవ్, కామెడీ, ఎమోషన్స్ తో నిండిపోయింది. ‘జబర్దస్త్’ షోలో అదిరిపోయే గెటప్ లతో ఆకట్టుకున్న శ్రీను, ఈ సినిమాతో తనలోని నటనను ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్సిడెంట్ కారణంగా ఓ యువకుడు జీవితాంతం నవ్వు ముఖంతోనే గడపాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.‘రాజు యాదవ్’ టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాతో హీరోగా గెటప్ శ్రీను సత్తా చాటేనా?
ఈ సినిమాలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ రెండు పాటలు రాశారు. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఇందులో ఓ పాట పాడారు. మరో రెండు పాటలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను, ఇప్పటికే పలు సినిమాల్లోనూ నటించాడు. చక్కటి నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇన్నాళ్లు కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను, ఈ సినిమాతో హీరోగా ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలి.
Read Also: గ్లామర్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నా, నటి శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్