X

Rajinikanth Health LIVE Updates: ఆస్పత్రిలో రజినీకాంత్.. సూపర్ స్టార్ ఆరోగ్యంపై లైవ్ అప్‌డేట్స్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 
Background

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం ఇంకా తెలియలేదు. ఈ అంశంపై పూర్తిస్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. కొందరు ఆయన అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరారని చెబుతుంటే, మరికొందరు సాధారణ చెకప్ కోసమే వెళ్లారని అంటున్నారు. ఆయన ఒక్కరోజు హాస్పిటల్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలోని ఆధ్వర్యపేటలో గల కావేరి ఆసుపత్రిలో నటుడు రజినీకాంత్ చేరారు. ఈ సందర్భంగా రజినికాంత్ భార్య ABP చెన్నై ప్రతినిధితో మాట్లాడుతూ.. రెగ్యులర్ చెకప్ కోసమే రజినీకాంత్‌‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ఏటా ఆయనకు ఇక్కడ బాడీ చెకప్ చేయిస్తామని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. రజినీతోపాటు ఆయన సోదరుడు కూడా హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలిసింది. పూర్తి బాడీ చెకప్ తర్వాత ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం రజినీకాంత్‌ను ఇంటికి పంపిస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.  

ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పెద్దన్న’ (తమిళంలో ‘అన్నాత్తే’) సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా రజినీకాంత్ తన భార్య, కుమార్తెలు తదితర కుటుంబ సభ్యులతో కలిసి ‘అన్నాత్తే’ సినిమా చూశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కుష్బు, మీనా, సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్.. రజినీకాంత్‌కు చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ విడుదల చేసిన పెద్దన్న టీజర్‌కు అభిమానులు, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'పల్లెటూరోడ్ని శాంతంగానే చూసి ఉంటావ్.. కోప్పడితే చూడలేదు కదా.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు' అనే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలిపింది. టీజర్ చివర్లో రజనీకాంత్ నడుచుకుంటూ వస్తుంటే.. పక్కన లారీలు గాల్లోకి ఎగిరే షాట్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ కి సినిమా ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు డి.ఇమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది.

ఆ తర్వాత విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ గ్రామీణ నేపథ్యంలో మాస్ సినిమా చేయకపోవడం.. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే ట్రైలర్‌లో హీరో చెల్లికి పెళ్లి చేసి సిటీకి పంపడం, అక్కడ రౌడీల గొడవ చూస్తే.. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమా గుర్తుకురాక మానదు.

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు