Rajesh Khanna Birth Anniversary: ఇండస్ట్రీలోనే కాదు పాలిటిక్స్ లోనూ సూపర్ స్టార్ ది అదే జోరు-అదే తీరు..
ఇండస్ట్రీలో శిఖరాగ్రానికి ఎంత త్వరగా చేరుకున్నాడో అంతే త్వరగా అధఃపాతాళానికీ పడిపోయిన రాజేశ్ ఖన్నా పాలిటిక్స్ లోనూ ఎంట్రీలో అదుర్స్ అనిపించాడు.
సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన రాజేశ్ ఖన్నా సినీ జీవితం 80ల ఆరంభంలో మసకబారడం మొదలైంది. దశాబ్దంపాటు బాలీవుడ్‌ను ఏలిన వ్యక్తిని వరుస పరాజయాలు పలకరించాయి. యాంగ్రీమెన్‌గా అమితాబ్ దూసుకొస్తున్నప్పుడు .. రాజేష్ ఖన్నా డౌన్ ఫాల్ ప్రారంభమైంది. ఇటు ఫ్యామిలీ లైఫ్‌లోనూ కష్టాలు మొదలయ్యాయి. ఫ్యాషన్ డిజైనర్, నటి అంజు మహేంద్రతో ఏడేళ్ల పాటూ డేటింగ్ చేసి వార్తల్లో నలిచాడు రాజేష్ ఖన్నా. మరోవైపు డింపుల్ తో పెళ్లైన పదేళ్లకే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. ఇంకోవైపు అదే సమయంలో వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంటే వ్యక్తిగత, వృత్తి జీవితం రెండూ ఒకేసారి దెబ్బతిన్నాయి.
Also Read: రక్తంతో ప్రేమ లేఖలు, కారుపై లిప్ స్టిక్ ముద్దులు.. ఆ సూపర్ స్టార్ రేంజే వేరప్పా..
కరిగిపోయిన సూపర్‌స్టార్ స్టేటస్ మరిచిపోయేందుకు రోజుల తరబడి మందులో మునిగితేలాడు. భర్త ఇగోని భరించలేకపోయిన డింపుల్ సడెన్‌గా ఇంట్లోంచి బయటకొచ్చేసింది. రాజేష్ ఖన్నా నివాసమైన ఆశీర్వాద్ ముందు ఒకప్పుడు గంపులుగుంపులుగా అభిమానులుండేవారు. కానీ ఆ తర్వాత తనని పలకిరంచేవారే లేకపోయారు. తొంభైల్లో సినీ జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పి.. రాజకీయ రంగ ప్రవేశం చేసారు. రాజీవ్ గాంధీ ఆహ్వానం మీద న్యూ ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలిచి.. 91 నుంచి 96 వరకు MPగా కొనసాగారు. దీంతో మళ్లీ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరించడంతో రెండోసారి ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల ప్రచారంలో సహాయం చేసిన డింపుల్..వ్యక్తిగత జీవితంలోకి మాత్రం రానని తెగేసి చెప్పింది.
Also Read: మహేష్‌తో సినిమా... స్క్రిప్ట్ సిట్టింగ్స్ గురించి రాజమౌళి రియాక్షన్!
తాగుడుకి బానిసవడంతో లివర్ దెబ్బతింది. ఒకప్పటి గ్లామర్ పూర్తిగా పోయింది, ఆరోగ్య పాడై అడుగు వేయడమే కష్టంగా మారింది. ఎదురుగా ఉన్నవారిని గుర్తుపట్టలేని దుస్థితి. ముంబై లీలావతీ ఆస్పత్రిలో చేరి కోలుకున్నాక ఇంటికి చేరాడు. అప్పుడు మళ్లీ భర్త అండగా నిలిచిన డింపుల్.. అప్పటి వరకూ తన స్థానాన్ని ఆక్రమించిన అనిత అనే మహిళను బయటకు పంపించేసింది. ఆవేశంతో బయటకు వెళ్లిన ఆమె అప్పటి వరకూ కలిసున్న తన పరిస్థితి ఏంటంటూ రాజేష్ ఖన్నాకు లీగల్ నోటిస్ ఇచ్చింది.ఆ లీగల్ నోటీస్ అందుకున్న మరుసటి రోజే అంటే జూలై 18, 2012 న రాజేశ్ ఖన్నా ముంబైలోని సొంతింటిలోనే కన్నుమూశారు. ఖన్నా సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన క్లాసిక్ మూవీ ''ఆనంద్'' సినిమా కథే.. తన నిజజీవిత గాధగా ముగిసిందని సినీ అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇండియన్ వెండి తెరపై తనదైన ముద్రను వేసిన రాజేష్ ఖన్నా జీవితంలో ఆసక్తికర సంఘటనల సమాహారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది ఫరా ఖాన్
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి