అన్వేషించండి

RRR Update : ప్రమోషనల్ సాంగ్ స్పెషాలిటీ ఇదే!

సినిమా చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ లో ఏం చూపించాలనే విషయంలో మేకర్లు పెద్దగా ఆలోచించరు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ ను రెడీ చేస్తున్నారు. 

నిజానికి సినిమా చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ లో ఏం చూపించాలనే విషయంలో మేకర్లు పెద్దగా ఆలోచించరు. సినిమాలో అదనంగా మిగిలిపోయిన పాటను లేదా మేకింగ్ విజువల్స్ ను చూపించి వాలేస్తారు. అంతకుమించి వాటి గురించి పట్టించుకోరు. కానీ రాజమౌళి మాత్రం దీన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇక్కడ కూడా తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నారు. గతంలో 'మగధీర' సినిమా సమయంలో కూడా ఇలానే రోలింగ్ టైటిల్స్ కోసం ఓ సాంగ్ పెట్టి.. అందులో సినిమాకి పని చేసిన లైట్ బాయ్ దగ్గర నుండి ప్రతి ఒక్కరినీ చూపించారు. 

ఇప్పుడు కూడా అలానే 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకి ఈ పాటకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం ప్రమోషన్ కోసం వాడతారు. తరువాత సినిమా చివర్లో రోలింగ్ టైటిల్స్ మీద ఈ సాంగ్ వేస్తారు. ఇప్పుడు ఈ పాటను భారీ ఎత్తున చిత్రీకరించనున్నారు రాజమౌళి. ఈ సాంగ్ కోసం రెండు భారీ సెట్స్ ను రెడీ చేశారు. ఒక సెట్ లో ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మీద కొన్ని మాంటేజ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. 

ఈ పాటలో హీరోహీరోయిన్లతో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ కనిపిస్తారు. అక్కడితో ఆగడం లేదు రాజమౌళి. ఈ సాంగ్ లో తన గత చిత్రాల హీరోలను కూడా చూపించాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు ప్రభాస్, రవితేజ లాంటి హీరోలకి ఇప్పటికే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఈ హీరోలతో పాటు నితిన్, నాని లాంటి యంగ్ హీరోలను కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలందరినీ ఒకే ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ దక్కుతుంది. 

ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి స్వయంగా చెప్పారు. ప్రకృతి అనే చిన్నారితో ఓ పాటను పాడించారు కీరవాణి.  'ఆర్ఆర్ఆర్‌'లోని తన పాటకి ప్రకృతి గొంతు మరింత జీవం పోసిందని ఆయన చెప్పారు. ఈ పాట ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు వినిపించాలా అని చిత్రబృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Embed widget