Rajamouli Appreciates Shashank: 'లూజర్ 2' చూసిన రాజమౌళి... ఆయన ఫెవరెట్ సీన్ ఏంటంటే?

జీ 5 ఓటీటీలో విడుదలైన 'లూజర్' వెబ్ సిరీస్ సీజన్ 2ను దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల చూశారు. ఆయన ఫెవరెట్ సీన్ ఏంటంటే...

FOLLOW US: 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా 'సై'లో శశాంక్ నటించారు. ఆ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా అనుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాల్లో శశాంక్‌కు అటువంటి క్యారెక్టర్ పడలేదు. రాజమౌళి సినిమాల్లో ఆయన ఎక్కడా కనిపించలేదు. కానీ, ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. శశాంక్ నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు దర్శక ధీరుడు చూస్తారు. ఇటీవల 'లూజర్ 2' చూశారు. అందులో శశాంక్ నటనను, సిరీస్‌ను ప్రశంసించారు. ఈ సంగతిని ట్విట్టర్ వేదికగా శశాంక్ తెలిపారు.

"ఎవరు 'లూజర్ 2' చూశారో చూడండి... మీరు సిరీస్ చూడటంతో పాటు నా పెర్ఫార్మన్స్ మెచ్చుకున్నందుకు థాంక్యూ రాజమౌళి గారు. ఓల్డ్ విల్సన్ మేనరిజమ్స్, నటనలో చిన్న చిన్న విషయాలు ఆకట్టుకునేలా ఉన్నాయని మీరు చెప్పడం గౌరవంగా భావిస్తున్నాను. అలాగే, సిరీస్ మీకు నచ్చడం సంతోషంగా ఉంది" అని శశాంక్ ట్వీట్ చేశారు. క్లైమాక్స్‌లో ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని జాన్‌ను విల్స‌న్ మోటివేట్ చేసే సీన్ రాజమౌళి ఫేవరెట్ సీన్ అని ఆయన తెలిపారు.

'లూజర్' తొలి సీజ‌న్‌లో నటించిన ప్రియదర్శి, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి రెండో సీజన్‌లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ధన్యా బాలకృష్ణ, హర్షిత్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సీజన్ తెరకెక్కించిన అభిలాష్ రెడ్డి... శ్రవణ్ మాదాలతో కలిసి రెండో సీజన్ తెరకెక్కించారు. దీనిని 'జీ 5', అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 21నుంచి సి సిరీస్ 'జీ 5'లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

View this post on Instagram
 
A post shared by ZEE5 Telugu (@zee5telugu)

Published at : 29 Jan 2022 03:45 PM (IST) Tags: Rajamouli Shashank Loser 2 Loser Season 2 Rajamouli Appreciates Loser 2 Rajamouli Lauds Loser 2

సంబంధిత కథనాలు

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!

Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!