By: ABP Desam | Updated at : 03 Jan 2023 12:18 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@alluarjun/twitter
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘పుష్ప:ది రైజ్’. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదలైంది. ఈ సందర్భంగా ‘పుష్ప’ చిత్ర బృందం రష్యాలో పర్యటించి జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. పలు టీవీ ఛానెళ్లకు వెళ్లి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. మొత్తంగా మాస్కోతో పాటు ప్రముఖ నగరాల్లో 774 స్క్రీన్లలో సినిమా ప్రదర్శింపబడుతోంది. అల్లు అర్జున్ క్రేజ్ కారణంగా ఈ సినిమాను ప్రేక్షకుల ఆధరణ బాగానే ఉంది.
PUSHPA 🇮🇳 IN RUSSIA 🇷🇺 pic.twitter.com/otf4opQ6ZJ
— Allu Arjun (@alluarjun) November 30, 2022
రష్యాలో ఇప్పటికే పలు ఇండియన్ సినిమాలు విడుదల కాగా, ఇటీవలి కాలంలో ‘పుష్ప’ మరింత ఆధరణ పొందింది. అంతేకాదు, తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సంపాదించుకుంది. రష్యాలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ సినిమా భారత్ లో విడుదలై ఏడాది పూర్తయినా, స్వదేశంతో పాటు విదేశాల్లోనూ బెంచ్ మార్క్ సెట్ చేస్తూనే ఉంది. రష్యాలో ఈ సినిమా ఇప్పటి వరకు 1.2 కోట్ల రూబిల్స్ వసూలు చేసింది. భారత కరెన్సీలో దాదాపు రూ.1.5 కోట్లను సాధించింది. రష్యాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ డబ్బింగ్ మూవీగానూ ‘పుష్ప’ సత్తా చాటింది. ఈ సినిమా మరికొద్ది రోజుల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ‘పుష్ప-2’ సినిమాను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో భాగాన్ని అద్భుతంగా రూపొందించాలనే యోచనలో ఉన్నారు. ఈ మేరకు కథలో మార్పు చేర్పులు చేస్తున్నట్లు తెలిసింది.
అటు ‘పుష్ప-2’కు సంబంధించిన డైలాగ్ ఇదే అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. “అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం” ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. గతంలో అల్లు అర్జున్ కూడా ‘పుష్ప-2’కు సంబంధించి ఓ డైలాగ్ లీక్ చేశాడు. తన సోదరుడు అల్లు శిరీష్ నటించిన `ఊర్వశివో రాక్షసివో` సినిమా వేడుకలో పాల్గొని ఓ డైలాగ్ చెప్పాడు. పుష్ప- 1లో 'తగ్గేదే లే' అయితే, పుష్ప 2లో 'అసలు తగ్గేదే లే' అవుతుంది అన్నాడు.
రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?
K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?
K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!
Nijam With Simtha : బాలకృష్ణ 'అన్స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు
యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?