అన్వేషించండి

Pushpa Movie: పుష్ప సీన్ రీక్రియేట్, అర్థనగ్నంగా బైకులపై కుర్రాళ్ల ర్యాలీ, వీడియో వైరల్

పుష్ప క్లైమాక్స్ సీన్‌ని రీక్రియేట్ చేసిన అల్లు అర్జున్ అభిమానులు.

ఈ వైరల్ వీడియో చూశారా

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చిన్న పిల్లాడి నుంచి పెద్ద వాళ్ల  వరకూ అందరికీ అలవాటైపోయిన ఊతపదం తగ్గేదేలే. పుష్ప మూవీలోని ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. కొంతమంది పిల్లలు ఈ డైలాగ్‌ చెబుతూ ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌ చేశారు. ఇక శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్ కూడా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్ల నుంచి స్టార్స్ వరకూ అందరూ ఈ స్టెప్‌ వేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు. చాలా రోజుల పాటు ఈ డ్యాన్స్‌ ట్రెండింగ్‌లో ఉంది. సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఇంకా జనాల్లో పుష్ప ఫీవర్ తగ్గలేదు. అందుకు సాక్ష్యమే ఈ వైరల్ అవుతున్న వీడియో.

  

పుష్ప క్రేజ్ ఇంకా తగ్గలేదన్నమాట

పుష్ప సినిమాలో క్లైమాక్స్‌లో విలన్‌తో మందు కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో అల్లు అర్జున్‌ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో విలన్‌కి వార్నింగ్ ఇస్తాడు. తరవాత అర్ధనగ్నంగా బైక్‌పై ఇంటికి వెళ్లి అదే గెటప్‌లో హీరోయిన్ మెడలో తాళి కడతాడు. ఈ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ మొత్తం సీక్వెన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కీ మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడీ సీన్‌నే రీక్రియేట్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు. కొందరు కుర్రాళ్లు చొక్కాలేకుండా బైక్‌లపై వీధుల్లో చక్కర్లు కొడుతూ పుష్ప క్లైమాక్స్‌ సీన్‌ని ఇలా మరోసారి క్రియేట్ చేశారు. జనమంతా చుట్టూ చేరి చూస్తుంటే వారి మధ్య నుంచి వేగంగా దూసుకుపోయారు. అల్లు అర్జున్‌ సిగ్నేచర్‌ అయిన AAపేరుతో ఉన్న జెండాని ఓ కుర్రాడు తన బైక్‌కు పెట్టుకున్నాడు. ఈ కుర్రాడు ముందు వెళ్తుంటే మిగతా వాళ్లంతా ఫాలో అయిపోయారు. 7 సెక్లనున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. పుష్ప క్రేజ్ ఇంకా తగ్గలేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వందల మంది ఈ వీడియోని రీట్వీట్ చేస్తున్నారు. 

జులైలో పార్ట్‌-2 షూటింగ్..!

పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ ఈ జులైలో మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయటం పూర్తైందనీ తెలుస్తోంది. నిజానిక పుష్ప పార్ట్‌-1 షూటింగ్ సమయంలోనే పార్ట్‌-2 కి సంబంధించిన కొన్ని సీన్లు తీశారట. ఇప్పుడు పూర్తిస్థాయిలో సీక్వెల్‌ షూటింగ్‌ను ఈ ఏడాది చివరిలోగా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది టీం. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్‌లో యాక్షన్ సీక్వెన్సెస్‌ వేరే లెవల్‌లో ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌ను ఇంతకు ముందుతో పోల్చితే కాస్త పెంచారనీ అంటున్నారు. మొత్తానికి పార్ట్‌-2 కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని అలరించనుందన్నమాట. 

Also Read: Vijay: విజయ్-వంశీ పైడిపల్లి సినిమా టైటిల్ ఇదేనా?

Also Read: Anushka Sharma: అనుష్క మరోసారి తల్లి కాబోతుందా? సెకండ్ చైల్డ్ ప్లానింగ్‌లో విరుష్క జోడీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget