News
News
X

Puri Jagannadh : ప్రేక్షకులను తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు : పూరి

ప్రేక్షకులను తప్ప తాను ఎవరినీ మోసం చేయలేదని దర్శకుడు పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. 'లైగర్' విడుదల తర్వాత ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్స్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

FOLLOW US: 

పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. అందులో మరో సందేహానికి తావు లేదు. పూరి సినిమాల్లో డైలాగులే కాదు... నిజ జీవితంలో ఆయన చెప్పే మాటలు కూడా తూటాల్లా ఉంటాయ్. 'లైగర్' సినిమా డిజాస్టర్ తర్వాత తలెత్తిన ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్స్ గొడవ నేపథ్యంలో ప్రస్తుతం పూరి చేసిన  వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. 

దగా చేస్తే... ప్రేక్షకులనే చేశా! - పూరి
''ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే... మనలను పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడు అయినా మోసం చేస్తే? దగా చేస్తే? అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే! ప్రేక్షకులను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు'' అని తాజాగా ఓ మీడియాకు రాసిన లేఖలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. తన ప్రేక్షకులకు మాత్రమే తాను జవాబుదారీ అని ఆయన వివరించారు. మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళను ఎంటర్‌టైన్ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

మోసం అనే మాట ఎందుకు వచ్చింది?
పూరి లేఖలో మోసం అనే మాట ఎందుకు వచ్చిందంటే... ఈ మధ్య ఆయనకు, కొంత మందికి మధ్య జరిగిన గొడవల కారణంగా! 'లైగర్' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టిన తర్వాత డబ్బులు వెనక్కి ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ నుంచి పూరి జగన్నాథ్ మీద ఒత్తిడి పెరిగింది. తొలుత కొంత మొత్తం ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే... డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారని తెలియడంతో పూరి హర్ట్ అయ్యారు. పరువు పోతుందని డబ్బులు ఇవ్వడానికి రెడీ అయితే... ధర్నా చేసిన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు ఇస్తానని తెలిపారు. అక్కడ నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. 

Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్

News Reels

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

కేసుతో మలుపు తిరిగిన పరిణామాలు!
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ మీద పూరి జగన్నాథ్ కేసు పెట్టారు. తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడే విధంగా వ్యక్తులను ప్రేరేపిస్తున్నారని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని, తాను ఇంటి దగ్గర లేని సమయంలో తన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని తల పెట్టవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో పూరి ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు.

పూరి జగన్నాథ్ ఫిర్యాదుతో డిస్ట్రిబ్యూటర్లకు షాక్ తగిలింది. తమను పూరి మోసం చేశారనే ఫీలింగ్ వారిలో ఉంది. ఫిలిం నగర్ అంతర్గత సంభాషణల్లో వారు ఆ అలా మాట్లాడుతున్నారట. అందుకని, తాను ఎవరినీ మోసం చేయలేదని పూరి చెప్పారనుకోవాలి. అదీ సంగతి! పూరి విడుదల చేసిన లేఖలో ఫిలాసఫీ ఎక్కువ కనిపించింది. మరణించిన తర్వాత ఎవరూ రూపాయి తీసుకు వెళ్లలేరని, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఒకదాని తర్వాత మరొకటి అలల తరహాలో వస్తాయని పేర్కొన్నారు. 

ఇప్పుడు ఛార్మి, పూరి ముంబైలో ఉన్నారు. నిర్మాణ సంస్థలను కలుస్తున్నారు. కొత్త సినిమా ఓకే చేసే పనుల్లో ఉన్నారు. 

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

Published at : 30 Oct 2022 02:22 PM (IST) Tags: Puri Jagannadh Puri On Liger Result Puri Letter Liger Movie Issues

సంబంధిత కథనాలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి