X

ఇన్‌స్టా బ్యూటీస్: గెడ్డం, మీసాలతో అనుపమా హల్‌చల్.. సెక్సీ దుస్తుల్లో పూజా హెగ్డే, రాశీఖన్నా రచ్చ!

టాలీవుడ్ బ్యూటీస్ రోజూ ఏదో ఒక ఫొటో లేదా వీడియోతో అభిమానులను అలరిస్తుంటారు. మరి ఈ రోజు ఎవరు ఎలా ఆకట్టుకున్నారో చూద్దామా.

FOLLOW US: 

సినిమాలు లేకపోతేనేం.. ఇన్‌స్టా‌గ్రామ్ ఉందిగా అని అంటున్నారు.. మన అందాల భామలు. షూటింగ్స్ లేకపోయినా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ అలరించడం మన టాలీవుడ్ హీరోయిన్లకు ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఈ విషయంలో అనుపమా పరమేశ్వరన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. అల్లరి ఆటలు.. చిలిపి చేష్టలు.. డబ్ స్మాష్‌లు.. ఫొటోషూట్లతో రోజూ తీరిక లేకుండా గడిపేస్తుంది. అవన్నీ ఆమె ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా.. ఆమె గెడ్డం, మీసాలతో ఉన్న ఓ వీడియోతో అభిమానులకు షాకిచ్చింది. ఏమిటా అని క్లిక్ చేసి చూస్తే.. ఆమె ఓ పాటకు ద్విపాత్ర అభినయం చేస్తూ కనిపించింది. పాట ప్రకారం.. అమ్మాయి గాత్రానికి, అబ్బాయి వాయిస్‌కు ఆమె అభినయించింది. ఫిల్టర్స్ ద్వారా గెడ్డం మీసాలతో కనిపించి.. తన ఫ్యాన్స్‌కు బోలెడంత ఫన్ అందిస్తోంది. ఆ వీడియోను ఈ కింది ఇన్‌స్టా పోస్ట్‌లో చూడండి. 

ఇక మన బెల్లం శ్రీదేవి.. అదేనండి రాశీఖన్నా విషయానికి వస్తే.. రోజుకో రకమైన వీడియో, ఫోటోలు పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తోంది. తాజాగా.. ఓ వీడియోలో అద్దం ముందు నిలుచుని హొయలు ఒలికించింది. అయితే, ఆ అద్దంలో ఆమె రూపం అనేక దుస్తులను మార్చుకుంటూ కనిపించింది. చివరికి ఒక బ్లాక్ డ్రెస్‌ను ఎంపిక చేసుకుని నడుము అందాలను చూపిస్తూ హోయలొలికించింది. ఈ వీడియో కూడా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. 

మరోవైపు తమన్నా కూడా తన అప్‌డేట్స్ ఇవ్వడంలో బిజీగా ఉంది. సోమవారం తాజాగా ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం కానున్నా తన వెబ్‌సీరిస్ గురించి చెప్పుకొచ్చింది. ఓ ఫొటోలో కూల్‌గా టేబుల్ ముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ మెస్మరైజ్ చేయగా.. మరో ఫొటోలో రితేష్ దేశ్‌ముఖ్‌తో కనిపించింది. టాలీవుడ్‌లో ప్రస్తుతానికి తమన్నాకు పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఆమె వెబ్‌సీరిస్‌ల మీదే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

మన అందాల శ్రీముఖి కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. ఒక వైపు యాంకరింగ్‌లో బిజీగా ఉంటూనే.. సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ఆమె నటించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై శ్రీముఖి చాలా ఆశలు పెట్టుకుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టా పిక్‌లో బుట్టబొమ్మలా మెరిసిపోతూ కనిపించింది. దీంతో ఆమె అభిమానులు ‘మన రాములమ్మ తోపు.. దమ్ముంటే ఆపు’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక పూజా హెగ్డే మరోసారి తన అందాలతో అభిమానులకు వల వేసింది. బ్లాక్ కలర్ క్లాత్‌తో తన పరువులను కప్పుకుని.. కొరుక్కు తినేస్తానంటూ చేతులు చాస్తూ ‘సింగం’ పోజు ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే.. టాలీవుడ్‌లో ఎంత బిజీగా ఉందో తెలిసిందే. అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’, ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, చిరంజీవి చిత్రం ‘ఆచార్య’లో నటిస్తోంది. 

Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?

Also Read: తన బాధ్యత నాదే.. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం అదే, రష్మీ భావోద్వేగం.. సుధీర్ గుడ్ న్యూస్!

Tags: Anupama Parameswaran శ్రీముఖి Puja Hegde Tamannaah Bhatia Rashi Khanna Srimukhi

సంబంధిత కథనాలు

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Corona virus: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే

Corona virus: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై  వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే

Weather Updates: బీ అలర్ట్.. నేడు సైతం ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు.. అక్కడ చలికి గజగజ

Weather Updates: బీ అలర్ట్.. నేడు సైతం ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు.. అక్కడ చలికి గజగజ

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

Gold Silver Price Today 24 January 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు

Gold Silver Price Today 24 January 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు