News
News
వీడియోలు ఆటలు
X

Project K: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి మరో అప్డేట్ - ‘రైడర్స్’ అంటే ఎవరో తెలుసా? ఈ వీడియో చూడండి

‘ప్రాజెక్ట్ కె’ నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఇప్పుడు స్క్రాచ్ ఎపిసోడ్ 2 ను విడుదల చేశారు. 

FOLLOW US: 
Share:

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీలో ఉంటున్నారు. ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘పాజెక్ట్ కె’ మూవీ ఒకటి. ఈ సినిమాకు ‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ అంచనాలు పెరగిపోయాయి. ఎందుకంటే ఈ సినిమాను నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతోంది. అయితే ఈ మూవీకు సంబంధించిన అప్డేట్ లను కూడా అంతే పగడ్బంధీగా రివీల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. సినిమాలో గ్రాఫిక్స్ కూడా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ‘ప్రాజెక్ట్ కె’ నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఇప్పుడు స్క్రాచ్ ఎపిసోడ్ 2ను విడుదల చేశారు. 

ఇందులో సినిమాలోని రైడర్స్ అని పిలిచే సైన్యం గురించి చూపించారు. అందులో రైడర్స్ ఎవరు అంటూ చర్చ జరుగుతోంది. మూవీ టీమ్ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రైడర్స్ గురించి చెప్తున్నారు. వాళ్లు ధరించే దుస్తులను కూడా ఇందులో చూపించారు. ఆ దుస్తులను ఎలా తయారు చేస్తున్నారు, షూటింగ్ ఎలా జరుగుతుంది వంటి అంశాలను చూపించారు. అయితే వీడియోలో చూపించినట్టు వాళ్లు విలన్ కు సంబంధించిన సైన్యమై ఉండొచ్చు అని అంటున్నారు. వాళ్లు అంతా ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు అని కూడా టాక్. ‘బాహుబలి’ లాంటి ప్రభావవంతమైన పాత్రలు చేసిన ప్రభాస్‌ను ఢీ కొట్టాలి అంటే ఆ సైన్యం ఎంత బలంగా ఉండాలి. అందుకే ఈ రైడర్స్ పాత్రను కూడా మూవీలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని సమాచారం. ఇది చూసిన నెటిజన్స్ ‘ప్రాజెక్ట్ కె’ కోసం నాగ్ అశ్విన్ ఒక పెద్ద సైన్యాన్నే సృష్టిస్తున్నాడని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే దర్శకుడు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని అర్ధమవుతుంది. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఉన్నారు మేకర్స్. 

అందుకే చిత్ర బృందం రైడర్స్ విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ రైడ‌ర్స్ ని త‌యారు చేసే ప‌నిలో ఉంది. దీంతో ఈ రైడర్స్ పాత్ర పై ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. రైడర్స్ తో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ వీడియోను గతంలో విడుదల చేసిన కొన్ని పోస్టర్లను చూస్తుంటే ఇది ఓ యుద్దానికి సంబంధించిన కథ కూడా అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో చూశాక ‘ప్రాజెక్డ్ కె’ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్, దిశా పటానీ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్. 

Published at : 10 Apr 2023 03:38 PM (IST) Tags: Nag Ashwin Amitabh bachchan Project K Prabhas

సంబంధిత కథనాలు

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

టాప్ స్టోరీస్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Botsa Satyanarayana: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి

Botsa Satyanarayana: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి