Telugu Film Federation strike: 'వాళ్లు రూల్స్ పాటించడం లేదు, నిర్మాతలని ఇబ్బంది పెట్టారు' సి.కళ్యాణ్ కామెంట్స్!
సినీ కార్మికుల డిమాండ్స్ పై ఫెడరేషన్ సభ్యులు స్పందిస్తూ.. ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
కరోనా కారణంగా భారీగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలా సమయంలో సినీ కార్మికులు బంద్‌కి పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా తమ వేతనాలు పెంచాలని సినీ కార్మికులు ఫెడరేషన్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ ఈ విషయంలో ఫెడరేషన్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కార్మికులంతా ఇప్పుడు సమ్మెకు దిగారు.
వారి డిమాండ్స్ ఏంటంటే..?
- క్లీనింగ్, ప్రొడక్షన్ బాయ్స్‌కి ప్రస్తుతం రోజుకు రూ. 1145 ఇస్తున్నారు. దానికి 30 శాతం పెంచి రూ. 1488 చేయాలని అడుగుతున్నారు. దాంతోపాటు ఇంతకుముందు మాదిరి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, పికప్ సౌకర్యం కూడా ఇవ్వాలని కోరుతున్నారు.
- ఆదివారం, సెలవురోజుల్లో ప్రస్తుతం రూ. 2290 అందుకుంటున్నారు. దీనిని రూ. 2977కి పెంచాలని అడిగారు.
- డ్రైవర్‌లకు ఇప్పుడు రోజుకు రూ. 1055 ఇస్తున్నారు. దీనిని రూ. 1362కి పెంచమని..
- ఆదివారం, సెలవు రోజులలో డ్రైవర్లకు రూ. 2110 బదులుగా రూ. 2743 ఇవ్వమని కోరుతున్నారు.
- లైట్‌మ్యాన్స్‌కి ఇప్పుడు రూ. 1110 ఇస్తుండగా, దానిని రూ. 1440కి పెంచాలని.. అలానే ఆదివారం, సెలవు రోజుల్లో రూ. 2200కి బదులు రూ. 2860గా మార్చాలని కోరుతున్నారు.
- ఇక ఫైటర్లు, డ్యాన్సర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతం వరుసగా రూ. 3265, రూ. 2800 ఉంది. దానిని ఫైటర్లకు రూ. 4244కి పెంచాలని కోరుతుండగా, డ్యానర్లకు రూ.3640 ఇవ్వాలని అడుగుతున్నారు.
ఇప్పుడు ఈ డిమాండ్స్ పై ఫెడరేషన్ సభ్యులు స్పందిస్తూ.. ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, దామోదరరావు, ప్రసన్న కుమార్ లాంటి పెద్దలు పాల్గొన్నారు. సమ్మె నోటీస్ ఇవ్వకుండా.. సమ్మె చేయడం వలన ఈరోజు నిర్మాతలు ఎన్నో కోట్లు నష్టపోయారని అన్నారు ప్రసన్న కుమార్. అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు చాలా క్లియర్ గా వర్కర్స్ తో చర్చలు జరిపామని సి.కళ్యాణ్ అన్నారు. వర్క్ కి రావొద్దని ఎవరూ అనలేదని.. మాకు తెలుసు ఎలా షూటింగ్స్ చేసుకోవాలో అని చెప్పారు. రేపు వాళ్లు షూటింగ్స్ లో పాల్గొంటే.. మేం ఎల్లుండి వారితో మీటింగ్ లో కూర్చుంటామని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ''వాళ్లు రూల్స్ పాటించడం లేదు.. ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. వారి కడుపుకొట్టాలని మేం అనుకోవడం లేదు.. ప్రతి వర్కర్ ని ప్రొడ్యూసర్స్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.. ఇదంతా వారికి తెలుసు కానీ ప్రజానీకానికి తెలియదు. ఒక లైట్ మ్యాన్, మేనేజర్, జూనియర్ ఆర్టిస్ట్స్ తీసుకునే వేతనాలు మరే ఇన్స్టిట్యూట్ లో రావు. 2018లో మూడేళ్లకు అగ్రిమెంట్ చేశాం. ఏడాది మాత్రమే ఆ అగ్రిమెంట్ రూల్స్ ఫాలో అయ్యారు. ఆ తరువాత కరోనా వచ్చింది. 2023 మే వరకు ఆ అగ్రిమెంట్ వర్తిస్తుంది. కానీ మేం అలా డిమాండ్ చేయడం లేదు. చర్చిస్తామనే అంటున్నాం. దయచేసి నాయకులు వర్కర్స్ కడుపుకొట్టద్దు. రేపు షూటింగ్స్ కి రండి మేం మీ డిమాండ్స్ గురించి మాట్లాడతాం'' అని అన్నారు సి.కళ్యాణ్.
''ఇదంతా డ్రామా.. చర్చలు మొదలుపెడితే రెండు, మూడు రోజుల్లో ఫినిష్ చేయగలం.. కానీ రెండు, మూడు నెలలు పడుతుంది. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం పెట్టిన రూల్స్ వర్కర్స్ కి కంఫర్టబుల్ గా ఉన్నాయ్ కాబట్టి వాళ్లు మార్చడానికి ఒప్పుకోవడం లేదు.. కానీ మారిన రోజుల బట్టి పద్ధతులు కూడా మారాలి కదా..?'' అని అన్నారు దామోదరరావు.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు