News
News
X

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించాడు. సినిమా చూసిన ఆయన బాగా నచ్చడంతో మూవీ టీమ్ ను అభినందించాడు.

FOLLOW US: 
Share:

సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో పైకి వచ్చిన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో హీరో సుహాస్ ఒకడు. సినిమాల మీద ఇంట్రస్ట్ తో పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ హీరో కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ పరిశ్రమలో నిలదొక్కకున్నాడు. తర్వాత ‘కలర్ ఫోటో’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సుహాస్ ఇటీవల నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ప్రశాంత్ షన్ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించాడు. సినిమా చూసిన ఆయన బాగా నచ్చడంతో మూవీ టీమ్ ను అభినందించాడు. తమ సినిమాను మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలు అభినందించడం పట్ల హీరో సుహాస్ హర్షం వ్యక్తం చేశాడు. 

‘రైటర్ పద్మభూషన్’ సినిమా మూవీ టీమ్ ప్రశంసిస్తూ సూపర్ స్టార్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో మహేష్ ఇలా రాసుకొచ్చాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది అని పేర్కొన్నాడు. సినిమాలో సుహాస్ నటన కూడా బాగుందని, దర్శకుడు ప్రశాంత్ షణ్ముఖ్‌, నిర్మాత అనురాగ్‌మై రెడ్డితో పాటు చిత్రబృందానికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు మహేష్. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవదులు లేవు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ ట్వీట్ పై హీరో సుహాస్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. మహేష్ బాబు కు థాంక్స్ చేప్తూ రీట్వీట్ చేశాడు. తాను భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. మహేష్ ట్వీట్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. 

ఇక మూవీ విడుదల అయిన రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే తర్వాత పూర్తి గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకు మంచి స్పందన వస్తోంది. అలాగే యూఎస్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.  మొదటి వారం పూర్తయ్యేలోపు రైటర్ మూవీ సుమారు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు ఈ సినిమాతోపాటు గా విడుదల అయిన సినిమాలు ఏవీ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ఈ శుక్రవారం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ సక్సెస్ ను బట్టీ సుహాస్ సినిమా లాభాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. సినీ విశ్లేషకులు. తాను ఎలాగైనా ర‌చ‌యిత కావాల‌ని పరిత‌పించే ఓ యువ‌కుడి క‌థ‌తో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా ఈ మూవీ ను రూపొందించాడు దర్శకుడు. అలాగే మహిళల ఇష్టాల్ని కూడా గుర్తించి వారిని ప్రోత్సహించాలనే మంచి సందేశాన్ని కూడా అందించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ లో టీనా శిల్పారాజ్ హీరోయిన్‌ గా న‌టించగా.. ఆశిష్ విద్యార్థి, రోహిణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించారు.

Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Published at : 06 Feb 2023 02:38 PM (IST) Tags: Mahesh Babu Writer Padmabhushan Suhas Prince Mahesh Babu

సంబంధిత కథనాలు

Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి

Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి

Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!

Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?