అన్వేషించండి

Akhil Cameo Role in Salaar 2: ప్రభాస్‌ 'సలార్‌ 2'లో అక్కినేని హీరో? క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ భార్య

Prashanth Neel Wife: ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో ఇంటారాక్ట్‌ అయ్యింది ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి. ఈ సందర్భంగా సలార్‌ 2లో అఖిల్‌ కామియో రోల్‌ చేస్తున్నాడా? అని ఓ నెటిజన్‌ ఆమెను ప్రశ్నించాడు.

Akhil Akkineni in Salaar 2?: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆయన ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్‌ను అందించింది ‘సలార్’. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ గత డిసెంబర్‌లో విడుదలైన మాసీవ్‌ హిట్‌ అందుకుంది. కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఇక విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. దీంతో మళ్లీ సలార్‌ మేనియా మొదలైంది. ఈ క్రమంలో పార్ట్‌ 2 చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే ‘సలార్’కు రెండు భాగాలు ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ నీల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడం పార్ట్‌ 2పై భారీ అంచనాల నెలకొన్నాయి. 

ఈ సలార్‌ పార్ట్‌ 2 ఎప్పుడు వస్తుందా? అని ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీక్వెల్‌కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రెండో భాగంలో అఖిల్‌ అక్కినేని అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇది తెలిసి అంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ నిజమని నమ్మేస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే సలార్‌ సక్సెస్‌ కావడంతో మేకర్స్‌ సెలబ్రేషన్స్‌ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్పెషల్‌ గెస్ట్‌ హాజరైన అఖిల్‌ స్పషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ మూవీ సక్సెస్‌లో సెలబ్రేషన్స్‌లో అఖిల్‌ భాగమవ్వడం వెనక అర్థమేంటని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో సలార్‌ సీక్వెల్లో అఖిల్‌ నటిస్తున్నాడా? అనే సందేహాలు మొదలయ్యాయి. 

ఇంకేముందే ఇదే అప్‌డేట్‌ అంటూ అఖిల్‌ను పార్ట్‌ 2లో చేర్చేశారు. అప్పటి నుంచి ప్రశాంత్‌ నీల్‌ అఖిల్‌ను లైన్లో పెట్టాడని, సలార్‌ సీక్వెల్లో అఖిల్‌ తీసుకుంటున్నాడంటూ రూమర్స్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ గాసిప్‌ప్‌ ఏకంగా ప్రశాంత్‌ నీల్‌ భార్య క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో ఇంటారాక్ట్‌ అయ్యింది ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి. ఈ సందర్భంగా సలార్‌ 2లో అఖిల్‌ కామియో రోల్‌ చేస్తున్నాడా? అని ఓ నెటిజన్‌ ఆమెను ప్రశ్నించాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. 'ఇది నిజం కాదు. అఖిల్‌ సలార్‌ 2లో చేస్తున్నాడంటూ వస్తున్న వార్తలు వట్టి రూమర్స్‌ మాత్రమే' ఆమె తెల్చిచెప్పింది. కాబట్టి సలార్ శౌర్యంగ పర్వంలో అఖిల్ లేనట్టే అని తేలిపోయింది. దీంతో ఈ రూమార్స్‌ చెక్‌ పడింది. అయితే అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం ఇది డిసప్పాయిట్‌ అవుతున్నారు. అయ్యే.. అయ్యగారు నిజంగానే సలార్‌ చేస్తున్నామనుకున్నామంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  
Akhil Cameo Role in Salaar 2: ప్రభాస్‌ 'సలార్‌ 2'లో అక్కినేని హీరో? క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ భార్య

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’ రేంజ్‌లో..

ఇదిలా ఉంటే సలార్ 2 కోసం ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా సీక్వెల్‌ పార్ట్‌ కథ కూడా రెడీ అయ్యిందని నిర్మాత విజయ్‌ అన్నారు. ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది కాబట్టి దాని షూటింగ్ ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభాస్, ప్రశాంత్ కూడా వీలైనంత త్వరగా దీనిని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వచ్చే 15 నెలల్లో సలార్ 2ను పూర్తి చేయాలని చర్చలు జరుగుతున్నాయి. 2025లో ఎట్టి పరిస్థితుల్లో సలార్ 2ను విడుదల చేస్తాం. సలార్‌కు వస్తున్న ఫీడ్‌బ్యాక్ నాకు నచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా సలార్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్‌లాంటిది. 20 ఏళ్లలో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్‌లాగా ప్రభాస్‌ను ప్రేక్షకులు మొదటిసారి చూస్తున్నారు. సలార్ 1 అనేది పార్ట్ 2కు కేవలం గ్లింప్స్ మాత్రమే. యాక్షన్ విషయంలో, తెరకెక్కించే విషయంలో పార్ట్ 2 మరింత భారీస్థాయిలో ఉంటుంది. డ్రామా, రాజకీయాలు, యాక్షన్ అన్నీ కలిపి సలార్ 2 ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లాగా ఉంటుంది’’ అని నిర్మాత విజయ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget