Adipurush Update: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - ఆదిపురుష్ అప్‌డేట్ వచ్చేస్తుంది - రిలీజ్ డేటేనా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ అప్‌డేట్ రానుంది. రేపు (మార్చి 1వ తేదీ) ఉదయం 7:11 గంటలకు ఆదిపురుష్ అప్‌డేట్ అందించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Adipurush: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రభాస్ (Prabhas) హవా నడుస్తుంది. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే... ఇలా అన్నీ భారీ సినిమాలే. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కేవే. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధం కాగా... ఆదిపురుష్ షూటింగ్ పూర్తయింది. సలార్, ప్రాజెక్ట్ కేల షూటింగ్ సమాంతరంగా నడుస్తుంది.
ఇప్పుడు ఆది పురుష్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను అందించనున్నట్లు సినిమా దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. రేపు (మార్చి 1వ తేదీ) ఉదయం 7:11 గంటలకు ఆదిపురుష్ అప్‌డేట్ రానుంది. ఈ సినిమా 2022 ఆగస్టు 11వ తేదీన విడుదల కావాల్సి ఉండగా... ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కోసం వాయిదా వేశారు.
కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. క్లాష్ అవ్వకుండా భారీ సినిమాలన్నీ ముందే డేట్లు బ్లాక్ చేసుకుంటున్నాయి. 2023లో డేట్లు బ్లాక్ చేసిన భారీ సినిమాలు కూడా ఉన్నాయి.
ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే... ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా నటిస్తున్న ఈ సినిమాలో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర ద్వయం సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. పూర్తిస్థాయి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సినిమా రూపొందింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
View this post on Instagram