Prabhas - Pooja Hegde Chemistry: కెమిస్ట్రీ పబ్‌లో ప్రేమికుల రోజున ప్రభాస్ - పూజా హెగ్డే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
ప్రభాస్ - పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని 'రాధే శ్యామ్' యూనిట్ అంటోంది. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అని చెప్పింది.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే అభిమానులకు ఓ కానుక ఇవ్వడానికి 'రాధే శ్యామ్' టీమ్ రెడీ అవుతోంది. ప్రేమకథా చిత్రానికి హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరడం చాలా ముఖ్యం. 'రాధే శ్యామ్' సినిమాలో ప్రభాస్, పూజ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని యూనిట్ అంటోంది. లవర్ డే రోజున రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో గల కెమిస్ట్రీ పబ్‌లో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తామని చెబుతోంది.
మార్చి 11న 'రాధే శ్యామ్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. "విధిరాతకు, ప్రేమకు మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని మార్చి 11న థియేటర్లలో చూడండి" అని ప్రభాస్ పేర్కొన్నారు. 'బాహుబలి', 'సాహో' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తర్వాత లవ్ స్టోరితో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో దీని కోసం ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన 'రాధే శ్యామ్' సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. హిందీలో టీ - సిరీస్ నిర్మాణ భాగస్వామి. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా... మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీలో పాటలకు స్వరాలు అందించారు.
View this post on Instagram