అన్వేషించండి

Prabhas Birthday - Adipurush Update : మర్యాద పురుషోత్తమ ప్రభు శ్రీరామ్ - ప్రభాస్

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఆదిపురుష్' చిత్రబృందం శుభాకాంక్షలు చెప్పింది. సినిమా నుంచి ప్రభాస్ కొత్త స్టిల్ విడుదల చేసింది.

ప్రభాస్ (Prabhas Birthday) సందర్భంగా 'ఆదిపురుష్' (Adipurush) చిత్ర బృందం అభిమానులకు చిరు కానుక ఇచ్చింది. సినిమా నుంచి కొత్త స్టిల్, పోస్టర్ విడుదల చేసింది. అభిమానులు చాలా మందికి ఇది సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే...
 
Prabhas Birthday Special Poster From Adipurush : 'ఆదిపురుష్' నుంచి ఆల్రెడీ ప్రభాస్ లుక్ విడుదల అయ్యింది. టీజర్‌లో లుక్ ఎలా ఉంటుందనేది చూపించారు. లుక్ కొత్తది కాదు. కానీ, స్టిల్ కొత్తది. దాంతో పాటు విడుదల చేసిన కాప్షన్ కొత్తది. 'ప్రాజెక్ట్ కె' టీమ్ తమకు హ్యాండ్ ఇచ్చిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్, ఈ పోస్టర్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదీ సంగతి! కొంత మంది ఫ్యాన్స్ ఈ అప్‌డేట్ మీద కూడా హ్యాపీగా లేరనుకోండి. అది వేరే విషయం.   

''మర్యాద పురుషోత్తమ ప్రభు శ్రీరామ్'' అంటూ 'ఆదిపురుష్' చిత్ర బృందం ఈ లుక్ విడుదల చేసింది. రియల్ లైఫ్‌లో ప్రభాస్ డౌన్ టు ఎర్త్ అని... ఆయన అందరికీ మర్యాద, గౌరవం ఇస్తారని ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతుంటారు. ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ''మర్యాద పురుషోత్తమ ప్రభాస్'' అంటూ అభిమానులు సంతోషిస్తున్నారు.

'ఆదిపురుష్' ప్రారంభమైనప్పటి నుంచి తాజాగా పుట్టిన రోజు స్టిల్ / పోస్టర్ విడుదల వరకూ... సినిమాకు సంబంధించిన ప్రతి అంశం వార్తల్లో ఉంటోంది. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించారు. టీజర్ విడుదలైన తర్వాత ఆయన అభిమానులు, ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. లుక్స్, గ్రాఫిక్స్ బాలేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. 

Also Read : ప్రభాస్ 'నో' చెప్పడం నేర్చుకోవాలా? మొహమాటాలు వదిలేయకపోతే ఫ్లాప్స్ తప్పవా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

యూట్యూబ్‌లో సిల్వర్ స్క్రీన్ మీద త్రీడీలో 'ఆదిపురుష్'ను చూస్తే బావుంటుందని హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్, ఇతర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీజర్ విడుదల తర్వాత వచ్చిన ట్రోల్స్ ప్రభావంతో పలు థియేటర్లలో త్రీడీలో టీజర్ ప్రదర్శించారు. అప్పుడు విజువల్ గ్రాండియర్ కొంత వరకు ప్రేక్షకులకు తెలిసింది. అయితే... లుక్స్ మీద మాత్రం ఇంకా విమర్శలు వస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాత కంటెంట్ చూశాక ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారని టీమ్ భావిస్తోంది. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా  ఉంటుందని చెబుతోంది.   

'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో సంక్రాంతికి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' కూడా విడుదల కానుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget