Poonam Kaur: ‘పీకే లవ్’ అంటూ పూనమ్ కౌర్ రచ్చ.. ఈమె చర్యలు ఊహాతీతం
పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఆమె చేసే ప్రతీ పోస్ట్ చర్చనీయాంశంగా మారుతోంది.
ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన పూనమ్ కౌర్ ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిగా నితిన్ నటించిన 'శ్రీనివాసకల్యాణం' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఒకట్రెండు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నా.. అవి ఎప్పటికి రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా పూనమ్ కౌర్ పేరు వార్తల్లో నిలుస్తోంది. 'మా' ఎన్నికలు ఈ నెల 10న జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి తన మద్దతు తెలుపుతూ మొన్నామధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రకాష్ రాజ్ 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైతే తను కొన్ని విషయాలను బయటపెడతానని కామెంట్ చేసింది. తాజాగా పూనమ్ చేసిన మరో ట్వీట్ సంచలనంగా మారింది. తన ఫొటోలు కొన్ని షేర్ చేసిన ఈ బ్యూటీ 'పీకే లవ్' అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. దీంతో పూనమ్ ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టిందంటూ చర్చించుకుంటున్నారు.
Also Read: 'మా' అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. అదొక బాధ్యత.. మోహన్ బాబు లేఖ
పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్ధం ఉన్నప్పటికీ.. ఇందులో మరిన్ని ఊహాగానాలు రేకెత్తిన్నట్లుగా ఉన్న ఆమె ట్వీట్ పై నెటిజన్లు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఆమె చేసే ప్రతీ పోస్ట్ చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
#pklove pic.twitter.com/SsnBORfjLW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి