ఓటీటీలోకి వచ్చేసిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ - కానీ!
టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం తీసిన 'పొన్నియన్ సెల్వన్2' ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియా ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ప్రస్తుతానికి రూ.399 చెల్లించి రెంటెడ్ పద్దతిలో మాత్రమే చూడొచ్చు
Ponniyin Selvan-2 OTT debut : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 2023లో విడుదలై బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. హీరో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అరంగేట్రం చేసింది.
గత కొన్ని రోజుల క్రితం చెప్పినట్టుగానే 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ సినిమా ఓటీటీలో ప్రస్తుతానికైతే అద్దెకు అంటే రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. భారీ డీల్ తో ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్.. సినిమా విడుదలై నెల తిరక్కుండానే అందుబాటులోకి తెచ్చినా రెంట్ పద్దతిలో మాత్రమే చూసేందుకు అవకాశం కల్పించింది. వీక్షకులు రూ. 399 చెల్లించి చూడాల్సి ఉంటుంది. అయితే డబ్బులు చెల్లించిన 48 గంటల్లోనే ఈ సినిమాను చూడడం పూర్తి చేయాలి. మిగిలిన కండిషన్స్ అన్నీ వర్తిస్తాయి. అయితే ఈ సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కైబ్ కావాల్సిన అవసరం లేదు. సబ్ స్ర్కిప్షన్ లేకున్నా రూ.399 చెల్లించి ఈ సినిమాను చూసే అవకాశాన్ని అమెజాన్ కల్పించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. హిందీ వెర్షన్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
'పొన్నియన్ సెల్వన్ 2' ఓటీటీలోకి ఫ్రీగా ఎప్పట్నుంచంటే..
తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ర్టీమింగ్ అవుతోన్న 'పొన్నియన్ సెల్వన్ 2' ప్రస్తుతం తమిళంతో పాటు అన్ని భాషల్లోనూ ప్రసారం అవుతోంది. ఇప్పుడు రెంటెండ్ పద్దతిలో ప్రసారం అవుతుండగా.. జూన్ రెండో వారం నుంచి ఈ చిత్రం అమెజాన్ సబ్ స్క్పైబర్లకు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించనుంది. కాబట్టి 'పొన్నియన్ సెల్వన్ 2'ను ఓటీటీలో ఫ్రీగా చూడాలనుకుంటే జూన్ 26వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ లో రిలీజై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల విడుదలైన రెండో భాగం కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 'PS-2' లో పైన పేర్కొన నటులతో పాటు ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, జయరామ్, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ఇతరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
మణిరత్నం సృష్టించిన కళాఖండం 'పొన్నియన్ సెల్వన్ 2' ఈ ఏడాది 28న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా పార్ట్ 1 విడుదలైన ఆరు నెలలకు మణిరత్నం పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ మూవీ కేవలం తమిళ ఆడియెన్స్ ను తప్ప మిగతా లాంగ్వేజెస్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదలకు ముందు నటీనటులు విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవిలు 'పొన్నియన్ సెల్వన్ 2' కోసం గట్టిగానే ప్రమోషన్లు చేసినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడియెన్స్ ఈ సినిమాను ఆదరించలేదు.