అన్వేషించండి
Ranveer Singh: న్యూడ్ ఫొటోషూట్ - రణ్‌వీర్ సింగ్‌పై పోలీస్ కంప్లైంట్
న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను రణవీర్ సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది.

రణవీర్ సింగ్ పై పోలీస్ కంప్లైంట్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ హీరో న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. బర్ట్ రెనాల్డ్స్ స్టైల్ లో ఈ ఫొటోషూట్ లో పాల్గొన్నారు రణవీర్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్స్ కొంత మంది ఇలాంటి న్యూడ్ ఫొటో షూట్స్ చేశారు. బాలీవుడ్‌లో ఇటువంటి షూట్స్ చేసిన వారి చాలా తక్కువ మంది.
ఇప్పుడు రణవీర్ సింగ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ.. మరికొంతమంది హీరోలు సెమీ న్యూడ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను రణవీర్ సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. చెంబూర్ పోలీస్ స్టేషన్ లో ఓ ఎన్జీవో రణవీర్ పై ఫిర్యాదు చేసింది.
మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ ఫొటోలు ఉన్నాయని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అలానే ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినవారు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై రణవీర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
View this post on Instagram
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















