By: ABP Desam | Updated at : 20 Jan 2023 04:50 PM (IST)
Edited By: sushusushmitha
Image Credit: Vardhan Puri/Instagram
కాస్టింగ్ కౌచ్ అనేది మహిళలకే కాదు మగవారిని కూడా వేధించే అంశమని బాలీవుడ్ యువ నటుడు వర్ధన్ పూరీ తెలిపాడు. ప్రముఖ నటుడు అమ్రిష్ పూరి మనవడే ఈ వర్ధన్ పూరి. తాతయ్య సపోర్ట్‌తో వర్ధన్ బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని అనుకున్నాడు. కానీ అవకాశాల్లేక పాపులర్ కాలేకపోయాడు. అయితే తనకు సినీ అవకాశాలు రానందుకు పెద్దగా బాధపడటం లేదు. కానీ తన అవసరాన్ని వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నించారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన తాతయ్య ఎంత పేరుమోసిన నటుడైనా తననూ లైంగికంగా వాడుకోవడానికి ప్రయత్నించారని వాపోయాడు. దేవుడి దయవల్ల ఇలాంటి వారి నుంచి తప్పించుకోగలిగానని, మగవారికి కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయని అంటున్నాడు.
కోవిడ్‌కి ముందు 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాలో తొలి అవకాశం దక్కించుకున్నాడు వర్ధన్. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అయిందో కూడా తెలీదు. దాంతో అతనికి రావాల్సిన గుర్తింపు రాకుండా పోయింది. ఆ తర్వాత కోవిడ్‌కి ముందు ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో కలిసి ‘నౌటంకి’ అనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొంత భాగం షూట్ అయ్యాక ఆగిపోయింది. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కోసం ఈ సినిమాను తీయాలనుకున్నాడట వివేక్. ఇందుకు కారణం వచ్చిన ఔట్‌పుట్ అంతగా బాగోలేదని వివేక్ అనుకోవడంతో సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని వర్ధన్ ఓ ఇంటర్వ్యూలో చెప్తూ కాస్టింగ్ కౌచ్ విషయం గురించి కూడా మాట్లాడాడు.
చాలా మంది డైరెక్ట్‌గానే కోరికలు తీర్చాలని అడుగుతుంటారని తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పాడు. కొంత డబ్బు ఇస్తే కావాల్సిన చేసి పెడతా అని కొందరు అడిగినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఫలానా వాళ్లు తెలుసని వారితో పరిచయం కల్పిస్తానని చెప్తుంటారని ఆ తర్వాత చూస్తే అసలు అవన్నీ అబద్ధాలేనని తెలిసి షాకైనట్లు తెలిపాడు. ఇలా సహాయం చేస్తా అని వచ్చేవారు అసలు ఇండస్ట్రీకి చెందినవారే కారని కూడా పేర్కొన్నాడు. ‘‘నేను కూడా ఇండస్ట్రీలోకి వెళ్తా అన్నప్పుడు మా తాతయ్య నాకు ఒక మాట చెప్పాడు. సినిమాల్లోకి రాకముందు థియేటర్ వర్క్ చేసేవాళ్లు సినిమాల్లోకి వచ్చాక తమకి తామే స్టార్స్‌గా ఫీలైపోతుంటారట. ఏదో బిగ్‌షాట్స్‌లా మన కళ్లముందే తిరుగుతూ ఉంటారట. ఇలాంటి వారి జోలికి వెళ్లకు అని చెప్పారు. ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదని చెప్పారు. ఇలా ఉండగలిగితే జీవితంలో ఓటమిపాలవయ్యే శాతం తక్కువగా ఉంటుంది. ఈ మాటలన్నీ నాకు మా తాతయ్య చెప్పారు. అవి నాకు బైబుల్‌తో సమానం. నేను అలాగే ఉంటూ మంచి సినిమాల కోసం వెతుకుతూ ఉంటే.. సడెన్‌గా నాకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు ఇంత డబ్బు ఇస్తే కావాల్సింది చేసి పెడతా అంటూ చాలా మంది నన్ను వాడుకోవాలని చూశారు. కానీ అలా అబద్ధాలు చెప్తూ బతికేవాళ్లు ఉంటారని తెలిసి జాగ్రత్తపడుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు వర్ధన్.
Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?
Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి