BRO Movie: ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు‘బ్రో’- క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు!
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘బ్రో’. త్వరలో ప్రేక్షకుల ముందు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం కీలక విషయం చెప్పింది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బ్రో’. ఈ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నటుడు సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘బ్రో’ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న 'వినోదయ సీతం' అనే సినిమాకు ‘బ్రో’ మూవీ రీమేక్ గా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. వరుస అప్ డేట్స్ తో సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ క్రమంలోనే మరో కీలక విషయాన్నివెల్లడించింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చినట్లు ప్రకటించింది. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చని వివరించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అటు ఇప్పటి వరకు విడుదల అయిన రెండు పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. జులై 21న విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై హైప్ పెంచుతుందని చిత్రబృందం భావిస్తోంది.
View this post on Instagram
ఈ నెల 28న ‘బ్రో’ విడుదల
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తోంది. జూలై 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓ జి' సినిమాలతో బిజీగా ఉన్నారు.
6 నెలల పాటు సినిమాలకు బ్రేక్
మరోవైపు ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ 6 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నారు. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమాలు చేస్తున్నా, ఆయనకు పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించడం లేదు. సరిగా డ్యాన్స్ వేయలేకపోతున్నారు. మాటలు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయనకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ సర్జరీ చేయించుకోనున్నారు. దీని కోసం 6 నెలల పాటు సినిమాలకు దూరం కానున్నారు.
Read Also: మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన DJ టిల్లు - అతని స్థానంలో మరో యంగ్ హీరోకి ఛాన్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial