News
News
X

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pavan Kalyan Shoes: హరిహర వీరమల్లు వర్క్‌షాప్‌లో పవన్ వేసుకున్న షూ కాస్ట్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

FOLLOW US: 

Pavan Kalyan Shoes: 

అసలు ధర ఎంత..? 

పవన్ కల్యాణ్‌ సినిమా అప్‌డేట్సే అవసరం లేదు. జస్ట్ ఆయన వర్కింగ్ స్టిల్స్‌ అలా వదిలినా చాలు...ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. వకీల్‌సాబ్‌ మూవీకి జస్ట్ ఒకే ఒక స్టిల్ ఏ రేంజ్‌లో ప్రమోషన్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాలా..? బ్లాక్‌ హుడీ వేసుకుని చేతులు జేబులో పెట్టుకుని
ఊరికే అలా సరదాగా నడుస్తున్నప్పుడు ఎవరో ఫోటో  తీసి నెట్‌లో షేర్ చేశారు. ఇక అంతే. అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ ఆ ఫోటోను చూసి తెగ మురిసిపోయారు. డీపీలుగా పెట్టుకున్నారు. కొందరైతే అదే స్టిల్ పెట్టి ఫోటోలూ దిగారు. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. భీమ్లానాయక్‌తో హిట్ కొట్టిన పవన్..ఇప్పుడు హరిహర వీరమల్లు షూట్‌తో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన వర్క్‌షాప్‌కు వచ్చారు పవర్‌స్టార్. రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్‌తో అదిరిపోయే లుక్‌లో కనిపించారు. ఈ లుక్‌ కూడా అందరికీ తెగ నచ్చేసింది. ఫ్యాన్స్‌ ఇప్పటికే ప్రమోషన్ మొదలుపెట్టారు.

అయితే...ఈ వర్క్‌షాప్‌లో పవన్‌ లుక్‌తో పాటు మరో ఇంట్రెస్టింగ్‌ విషయం కూడా వైరల్ అవుతోంది. ఆయన వేసుకున్న షూస్ గురించి పెద్ద డిస్కషనే నడుస్తోంది. దీని ధర రూ.10 లక్షలు అని సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఇంకొందరైతే...ఆ షూ కంపెనీ ఏంటి..? అవి ఎక్కడ దొరుకుతాయి..? అనే వివరాలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి లింక్స్‌ కూడా పెడుతున్నారు. పవర్‌స్టార్ ధరించిన షూస్ Copenhagen కంపెనీవి. అయితే దీని ధర విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కాస్త షాకింగ్‌గా ఉంది. అఫీషియల్ సైట్‌లో చూస్తే దీని ధర 119,94 eurosగా ఉంది. అయితే డచ్‌ లాంగ్వేజ్‌లో ఫుల్‌స్టాప్‌ను, కామాగా రాస్తారు. ఫలితంగా...అందరూ దీని ధర రూ.10 లక్షలు అని మన కరెన్సీకి కన్‌వర్ట్ చేసి ఫిక్స్ అయిపోయారు. కానీ...దీని అసలు ధర 119.94 యూరోలు. అంటే..మన కరెన్సీలో సుమారు రూ.9,600. సో...పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేసుకున్న ధర అదన్నమాట. 

News Reels

వర్క్‌షాప్స్‌లో పవన్ బిజీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. మొన్నా మధ్య క్రిష్ తో కలిసి స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నారు పవన్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఆ తరువాత మళ్లీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్వీట్ చూస్తుంటే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసిన కీరవాణి.. 'నవరాత్రులలో నవ ఉత్తేజం' అంటూ పోస్ట్ పెట్టారు. వారి పక్కన ఉన్న బ్యానర్ లో హరిహర వీరమల్లు -షెడ్యూల్ వర్క్‌షాప్ అని రాసి ఉంది. అంటే షూటింగ్ కి వెళ్లబోయే ముందు చేసే రిహార్సల్స్ అన్నమాట. అయితే ఇది షూటింగ్ కు సంబంధించిందా..? లేక మ్యూజిక్ రిలేటెడా..? అనేది తెలియడం లేదు. సాధారణంగా అయితే పవన్ ఇలా వర్క్ షాప్స్ లో పెద్దగా కనిపించరు. కానీ ఈ సినిమా విషయంలో ఎక్ట్రా కేర్ తీసుకున్నారు. ఇక ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సన్నగా ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.

Also Read: Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Published at : 01 Oct 2022 03:12 PM (IST) Tags: Krish Pawan Kalyan Pavan Kalyan Shoes Pavan Kalyan Shoe HariHara VeeraMallu Workshop Copenhagen Shoes Copenhagen Shoe Cost

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు