Pawan Kalyan - Balakrishna : బాలకృష్ణను కలిసిన పవన్ కళ్యాణ్ - ఎక్కడంటే?
Pawan Kalyan Meets Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణను పవన్ కళ్యాణ్ కలిశారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిశారు. వీరిద్దరి కలయికకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియో వేదిక అయ్యింది. ఎందుకు కలిశారు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). శృతి హాసన్ కథానాయిక. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. టోటల్ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ, శృతిపై ఆ పాటను తెరకెక్కించనున్నారు. ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సెట్‌కు వెళ్ళారు.
వీర సింహా రెడ్డిని కలిసిన వీరమల్లు
అన్నపూర్ణ స్టూడియోలో 'వీర సింహా రెడ్డి' సాంగ్ కోసం సెట్ వేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో సాంగ్ తెరకెక్కిస్తున్నారు. అక్కడికి పవన్ వెళ్ళారు. ఆయనతో పాటు 'హరి హర వీర మల్లు' దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత ఏయం రత్నం ఉన్నారు. కాసేపు హీరోలు ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు. ''వీర సింహా రెడ్డిని కలిసిన వీరమల్లు. పవన్ కళ్యాణ్ తో సినిమా సెట్‌లో నట సింహం నందమూరి బాలకృష్ణ, ఇతర చిత్ర బృందం సభ్యులు'' అని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది.
'వీర సింహా రెడ్డి' నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాను కూడా నిర్మించనుంది. ఆ సంస్థ అధినేతలలో ఒకరైన వై. రవిశంకర్ కూడా సెట్‌లో ఉన్నారు. త్వరలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ కళ్యాణ్ రానున్నారు. ఆయనతో పాటు క్రిష్ కూడా ఉంటారని టాక్.
Also Read : నిర్మాతలు ఎలా ఒప్పుకొన్నారు? కళాతపస్వి సంచలన వ్యాఖ్యలు
View this post on Instagram
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'వీర సింహా రెడ్డి' విడుదల కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణది డ్యూయల్ రోల్. అయితే, ఆయన మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారట. ఆల్రెడీ ఫ్యాక్షన్ లీడర్ లుక్ ఫస్ట్ విడుదల చేశారు. అది తండ్రి క్యారెక్టర్. రెండోది కుమారుడి క్యారెక్టర్. ఇటీవల విడుదలైన 'సుగుణ సుందరి'లో ఆ లుక్ అంతా చూశారు. కథానుగుణంగా కుమారుడు విదేశాల్లో ఉంటాడు. అప్పటి లుక్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కుమారుడి లుక్‌లో చేంజెస్ ఉంటాయని తెలిసింది.
బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ విడుదలైన 'జై బాలయ్య...', 'సుగుణ సుందరి...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర
హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.