IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Koshiyum Hindi Rights: పవన్ కళ్యాణ్, రానా సినిమా డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంత రేటు పలికిందంటే!

పవన్-రానా లాంటి హీరోలు కలిసి నటిస్తుండడంతో సినిమాకి రూ.23 కోట్లు రేటు పలికిందని తెలుస్తోంది. 

FOLLOW US: 

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా గెటప్‌లను రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై భీమ్లా నాయక్‌గా చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.23 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నిజానికి రీమేక్ సినిమాల డబ్బింగ్ రైట్స్‌కు ఇంత ధర పలకదు. అయితే ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ.. స్క్రిప్ట్ ను చాలా వరకు మార్చినట్లు తెలుస్తోంది. పైగా భారీ ఫైట్లు జోడించడం, ఎమోషన్స్‌ను పెంచడం వంటి కారణాలతో ఈ రేటు పలికినట్లు సమాచారం. 

ఇప్పటివరకు తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ రేట్లలో 'వినయ విధేయ రామ' సినిమా భారీ ధరకు అమ్ముడైంది. ఆ సినిమా కోసం అప్పట్లో దాదాపు రూ.21 కోట్లు వెచ్చించి హిందీ డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్నారు. ఇప్పుడు అంతకుమించి పవన్ సినిమాకి రేటు పలికింది. పైగా ఉత్తరాదిన రానాకి గుర్తింపు ఉండటం కూడా ఈ సినిమా బిజినెస్‌కి కలిసొస్తుంది. పవన్-రానా లాంటి హీరోలు కలిసి నటిస్తుండడంతో సినిమాకి రూ.23 కోట్లు రేటు పలికిందని తెలుస్తోంది. 

డబ్బింగ్ రైట్స్ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్ర నిర్మాతలు శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం కూడా భారీ రేటు కోట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం రూ.44 కోట్ల వరకు కావాలని అడుగుతున్నారట. ఈ విషయంలో జీ సంస్థతో బేరాలు సైతం మొదలుపెట్టారని టాక్. ఈ రేటు గనుక ఫిక్స్ అయితే నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే రూ.67 కోట్లు రావడం ఖాయం. ఇక థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్‌లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కనిపించనుంది. రానాకి భార్య పాత్రలో ఐశ్వర్యారాజేష్‌ను ఎంపిక చేసుకున్నారు. 

Published at : 30 Jul 2021 08:05 AM (IST) Tags: Rana Daggubati pawan kalyan Ayyappanum Koshiyum Remake Sagar k chandra Trivikram Hindi Dubbing Rights

సంబంధిత కథనాలు

Kaduva Postponed: ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా

Kaduva Postponed: ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా

Karthika Deepam జూన్ 28 ఎపిసోడ్: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల

Karthika Deepam  జూన్ 28 ఎపిసోడ్:  ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?

Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?

టాప్ స్టోరీస్

Hyderabad Traffic News: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!

Hyderabad Traffic News: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్‌కు వెళ్తారా?

KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR  రాజ్ భవన్‌కు వెళ్తారా?

Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్‌లో ప్రయోగం సక్సెస్

Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్‌లో ప్రయోగం సక్సెస్