Papam Pasivadu Trailer : సింగర్ శ్రీరామచంద్ర హీరోగా 'పాపం పసివాడు' - ట్రైలర్ ఎలా ఉందో చూశారా?
ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘పాపం పసివాడు’. త్వరలో ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు రానున్న ఈ సిరీస్ టీజర్ ను దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు.
తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ అదరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. పలు షోలతో పాటు సిరీస్ లు, సినిమాలను నిర్మిస్తోంది. చక్కటి కామెడీ, ఎమోషనల్ తో కూడిన కంటెంట్ తో వ్యూవర్స్ ను అకట్టుకుంటోంది. వారం వారం ‘ఏజెంట్’ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్న ‘ఆహా’, మరో వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’అనే కామెడీ వెబ్ సిరీస్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫన్ రైడర్ సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
‘పాపం పసివాడు’ ట్రైలర్ విడుదల
ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తే ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్‌ను తాజాగా దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ‘పాపం పసివాడు’ సిరీస్‌లో ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఇందులో శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఫుల్ ఫన్ తో ఆకట్టుకుంది. ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అవుతూ ఫన్ ను జెనరేట్ చేశాడు. ఇతడు ఓ అమ్మాయిని ఇష్టపడటం, మరో అమ్మాయి ఇతడిని ఇష్టపడటం, ఇద్దరి కాదని ఇంకో అమ్మాయి వచ్చిన చచ్చినా నేనే నచ్చాని చెప్పాలంటూ గన్ తో బెదిరించడం ఆకట్టుకుంది.
View this post on Instagram
ప్రేక్షకులను బాగా అలరిస్తుంది- దర్శకుడు సందీప్ రాజ్
తన చేతుల మీదుగా ‘పాపం పసివాడు’ సిరీస్ ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు దర్శకుడు సందీప్ రాజ్. ‘‘’పాపం పసివాడు ట్రైలర్’ నా చేతుల మీదుగా రిలీజ్ కావటం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రేమ, కామెడీ కాంబోలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సిరీస్ ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు” అన్నారు. అటు ఈ సిరీస్ తో నటుడిగా మారడం పట్ల శ్రీరామచంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఆహాతో నేను కలిసి పని చేయటం ఇది మూడోసారి. యాంకర్‌గా ఇక్కడ నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు పాపం పసివాడు సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.
‘పాపం పసివాడు’ సిరీస్ కు లలిత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కైషోర్ కృష్ణ సహ దర్శకుడిగా కొనసాగుతున్నారు. గౌకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఈ సిరీస్ కు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయ్ మక్కెన ఆర్ట్ డైరెక్టర్ కాగా, జోస్ జిమ్మీ సంగీతాన్ని సమకూర్చారు.
Read Also: పదేళ్ల తర్వాత 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - హైదరాబాద్‌లో అంజలి, కోన వెంకట్ సినిమా షురూ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial