Ranga Ranga Vaibhavanga Release Date: వేసవిలో మెగా మేనల్లుడి 'రంగ రంగ వైభవంగా'! సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Ranga Ranga Vaibhavanga Release Date: వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నారు. ఈ రోజు 'రంగ రంగ వైభవంగా' విడుదల తేదీ ప్రకటించారు.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఇందులో కేతికా శర్మ కథానాయిక. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు. మే 27న 'రంగ రంగ వైభవంగా' ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మావయ్య వచ్చిన నెల తర్వాత మేనల్లుడు రానున్నాడన్నమాట.
ఆల్రెడీ విడుదలైన 'రంగ రంగ వైభవంగా' టీజర్, 'తెలుసా తెలుసా' పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. మే 27న అడివి శేష్ 'మేజర్' కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో రాధాగా కేతికా శర్మ, రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram





















