Hello World: జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!
హలో వరల్డ్ తెలుగు వెబ్ సిరీస్ జీ5లో ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జీ5 మరో తెలుగు వెబ్ సిరీస్‌తో రావడానికి సిద్ధం అవుతోంది. ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ జీ5లో ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్య శెట్టి, నిఖిల్ వి.సింహా, అపూర్వ రావు, గీలా అనిల్, స్నేహాల్ ఎస్.కామత్, రవి వర్మ, జయప్రకాష్‌లు కూడా నటించనున్నారు.
ఈ సిరీస్‌కు శివసాయి వర్థన్ జలదంకి దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. పీకే దండి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఏడురోలు రాజు తీసుకున్నారు. ప్రముఖ ఎడిటర్ ప్రవీణ్ పూడి ఈ సిరీస్‌ను ఎడిట్ చేశారు. ఇప్పుడే ఉద్యోగంలోకి అడుగుపెట్టిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు.
జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల కంటెంట్ అందుబాటులో ఉంది. బ్లాక్‌బస్టర్ ఆర్ఆర్ఆర్‌తో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజర్ సిరీస్, గాలి వాన, రెక్కీ, మా నీళ్ల ట్యాంక్ వంటి వెబ్ సిరీస్‌లు కూడా జీ5లో చూడవచ్చు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

