(Source: ECI/ABP News/ABP Majha)
Malayalam Horror Movies: థ్రిల్లింగ్ సినిమాలు చూడాలని ఉందా? అయితే, ఈ మలయాళం హర్రర్, థ్రిల్లర్స్ ట్రై చేయండి
థ్రిల్లింగ్ సినిమాలు చూడాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ మలయాళీ మూవీస్. ఇక్కడ తెరకెక్కిన ఎన్నో హార్రర్, థ్రిల్లర్ సినిమాలు ఆడియెన్స్ కు ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి.
తెలుగు, తమిళ సినిమాలతో పోల్చితే మలయాళ సినిమా పరిశ్రమలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కనిపిస్తాయి. అక్కడ తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాయి. మాలీవుడ్ లో సాధారణ సినిమాలతో పాటు హార్రర్ చిత్రాలు కూడా అధికంగానే తెరకెక్కుతాయి. ఈ హార్రర్ మూవీస్ ఎక్కువగా సస్పెన్స్, రిజల్యూషన్ అంశాలతో తెరకెక్కుతాయి. చాలా సహజంగా, రియల్‌గా అనిపిస్తాయి. అందుకే థ్రిల్లింగ్ సినిమాల కోసం వెతికే వారు ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ మలయాళీ సినిమాలను ట్రై చేయడం బెస్ట్.
OTT ప్లాట్ ఫామ్స్ లో బెస్ట్ మలయాళ హార్రర్ సినిమాలు ఇవే!
చతుర్ ముఖం
‘చతుర్ ముఖం’ అనే చిత్రం మలయాళీ ఇండస్ట్రీలో రూపొందించబడిన తొలి టెక్నో హారర్ మూవీ. ఈ మూవీ స్టోరీ ఫోన్ అడిక్ట్ అయిన తేజస్విని చుట్టూ తిరుగుతుంది. ఆమె తన ఫోన్‌ను పోగొట్టుకుని ఆన్‌లైన్‌లో కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది అనేదే సినిమా కథాంశం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం వల్ల కలిగే నష్టాలను ఈ హార్రర్ చిత్రంలో చూసే అవకాశం ఉంటుంది. మంజు వారియర్, సన్నీ వేన్, నిరంజన అనూప్, శ్రీకాంత్ మురళి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ OTT ప్లాట్ ఫారమ్ Zee5లో అందుబాటులో ఉంది.
కుమారి
‘కుమారి’ మలయాళ ఫాంటసీ హర్రర్ చిత్రం. శాపగ్రస్త కుటుంబానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. కొన్ని చీకటి రహస్యాలు తెలియక పెళ్లి చేసుకున్న ‘కుమారి’ తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనేది ఈ సినిమాలో చూపిస్తారు. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో కుమారి పాత్ర పోషించింది. షైన్ టామ్ చాకో, తన్వి రామ్, శ్రుతి మీనన్ కీ రోల్స్ చేశారు. ఈ సినిమాను ‘నెట్ ఫ్లిక్స్’ ఓటీటీలో చూడవచ్చు.
భూతకాలం
‘భూతకాలం’ మూవీ ఒక తల్లీ కొడుకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ సైకలాజికల్ హార్రర్ సన్నివేశాలు వీక్షకులను అయోమయానికి గురి చేస్తాయి. రేవతి, షేన్ నిగమ్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ OTT ప్లాట్ ఫారమ్ సోనీ LIVలో అందుబాటులో ఉంది.
ది ప్రీస్ట్
సంపన్న కుటుంబంలో జరిగిన రహస్య ఆత్మహత్యలను పరిశోధించడానికి పూజారి అయిన ఫాదర్ కామెరూన్‌ను ఒక అమ్మాయి సంప్రదిస్తుంది. జోఫిన్ టి చాకో దర్శకత్వం వహించిన ‘ది ప్రీస్ట్’ లో మమ్ముట్టి, మంజు వారియర్, నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా OTT ప్లాట్ ఫారమ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అందుబాటులో ఉంది.
9 (తొమ్మిది)
ఆల్బర్ట్ లూయిస్ తన కొడుకు, ఇతర సహోద్యోగులతో కలిసి ఖగోళ పరిశోధన కోసం హిమాలయాలకు బయలుదేరతాడు. అక్కడ ఎవా అనే మహిళను కలుస్తాడు. ఆమెను కలిసిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయో ఈ చిత్రంలో చూడవచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్, వామికా గబ్బి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెనూస్ మహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని OTT ప్లాట్ ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.
Read Also: బొమ్మల పుస్తకంగా ‘RRR’ సినిమా, కొడుకుపై ప్రేమతో ఆ తండ్రి ఏం చేశాడో చూడండి