Virgin Boys OTT Streaming: ముగ్గురు కుర్రాళ్ల లవ్ రొమాంటిక్ రైడ్ - ఓటీటీలోకి వచ్చేసిన 'వర్జిన్ బాయ్స్'
Virgin Boys OTT Platform: బిగ్ బాస్ ఫేం మిత్రా శర్మ, గీతానంద్ జంటగా నటించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ డ్రామా వర్జిన్ బాయ్స్ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Mitraaw Sharma's OTT Streaming On Aha: లవ్, యూత్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి జానర్‌కే చెందుతుంది లేటెస్ట్ మూవీ 'వర్జిన్ బాయ్స్'. బిగ్ బాస్ ఫేం మిత్రాశర్మ, గీతానంద్ జంటగా నటించిన ఈ మూవీ జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ముగ్గురు అబ్బాయిలు. ఓ కాలేజ్. లవ్, ఫ్రెండ్ షిప్, చాలా గందరగోళం' అంటూ ఆహా పోస్ట్ చేసింది. ఈ మూవీకి దయానంద్ దర్శకత్వం వహించగా... రాజ్ గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దరుపునేని నిర్మించారు. గీతానంద్, మిత్రాశర్మలతో పాటు రోనీత్, జెన్నిఫర్, శ్రీహాన్, అన్షులా, సుజిత్ కుమార్, అభిలాష్, కౌశల్ మండ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read: బిపాసాకు మృణాల్ సారీ... అప్పుడు నాకు 19 ఏళ్లు, తెలిసీ తెలియక ఏదో మాట్లాడా, క్షమించమ్మా!
స్టోరీ ఏంటంటే?
ఆర్య (గీతానంద్), డుండీ (శ్రీహన్), రోనీ (రోనీత్) ముగ్గురూ ఒకే యూనివర్శిటీలో బీటెక్ చేస్తుంటారు. అందరూ వర్జిన్స్. తమ క్లాస్‌మేట్ ఇచ్చిన పార్టీలో చైల్డ్ హుడ్ ఫ్రెండ్ (కౌశల్ మండ)ను కలుస్తారు. మాటల మధ్యలో వీరికి ఓ ఛాలెంజ్ చేస్తాడు. డిసెంబర్ 31 అంటే తాను అమెరికా వెళ్లి వచ్చే లోపు ఎలాగైనా వర్జినిటీ కోల్పోవాలని సవాల్ విసురుతాడు.
సరయు (మిత్రా శర్మ)ను ఆర్య ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి క్లాసికల్ డ్యాన్సర్ కూడా! కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ కోసం రాధాకృష్ణులుగా సరయు, ఆర్య ఎంపిక అవుతారు. లైలా (జెన్నిఫర్)తో డుండీ (శ్రీహాన్) ప్రేమలో పడతాడు. రోని (రోనిత్ రెడ్డి)కి ఓ అమ్మాయి (అన్షులా ధావన్) దగ్గర అవుతుంది. ముగ్గురు అబ్బాయిలకు ప్రేమలో ఆ అమ్మాయిలూ ఎటువంటి పరీక్షలు పెట్టారు? అసలు వారు వర్జినిటీ కోల్పోవడానికే ప్రేమలో పడ్డారా? వీరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? డిసెంబర్ 31లోపు తాము ప్రేమించిన అమ్మాయిలతో అబ్బాయిలు శారీరకంగా కలిశారా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















