Venkatesh - Suma: ఈ మధ్య హీరోలంతా నన్ను ఇలాగే చూస్తున్నారు - వెంకటేష్‌కు సుమ పంచ్
ఇటీవల విక్టరీ వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వెబ్ సిరీస్ టీమ్ ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా వెంకటేష్ సుమపై సీరియస్ అయ్యారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో సినిమాల ఆడియో ఫంక్షన్లు ప్రీరిలీజ్ ఈవెంట్ లు అంటే వెంటనే గుర్తొచ్చే యాంకర్ పేరు సుమ. పెద్ద హీరోల సినిమాల పంక్షన్ లకు యాంకర్ సుమ పెట్టింది పేరు. ఫంక్షన్ కు వచ్చే గెస్ట్ లు, స్టార్ హీరోలు ఎవరైనా వారితో సరదాగా మాట్లాడుతూ అభిమానులకు వినోదాన్ని అందిస్తుంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రోగ్రాం ను సక్సెస్ ఫుల్ చేస్తుంది. అందుకే నిర్వాహకులు యాంకరింగ్ కు దాదాపు సుమ నే ఎంపిక చేస్తారు. వేదికపై ఏదైనా పొరపాటు జరిగినా మళ్లీ దాన్ని అప్పటికప్పుడు తన సమస్పూర్తితో సరిదిద్ది వివాదాలు లేకుండా ప్రోగ్రాంను సాఫీగా కొనసాగిస్తుంనే పేరు ఆమెకు. అందుకే సుమకు అంత క్రేజ్ ఉంది. అయితే ఎంత పెద్ద యాంకర్ అయినా ఒక్కోసారి టంగ్ స్లిప్ అయితే వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఇక స్టార్ హీరోల పక్కన ఉన్నప్పుడు జరిగితే అంతే సంగతులు. తాజాగా సుమ ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది. అయితే ఆ విషయాన్ని మరో వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో చమత్కరించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సుమ వైపు సీరియస్ గా చూసిన వెంకీ..
ఇటీవల విక్టరీ వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వెబ్ సిరీస్ టీమ్ ఓ కార్యక్రమంలో పాల్గొంది. దీనికి యాంకర్ సుమ హోస్ట్ గా చేసింది. ఈ సందర్భంగా కొన్ని జోక్స్ పేల్చింది. అయితే సుమ మాట్లాడుతూ మధ్యలో విక్టరీ వెంకటేష్ ను ‘‘మీరు వెబ్ సిరీస్ లో చూసినట్టు ఒకసారి నావైపు సీరియస్ గా చూడండి సర్’’ అని వెంకటేష్ ను అడుగుతుంది. దీంతో వెంకటేష్ కాసేపు ఆమెను కాసేపు సీరియస్ గా చూస్తారు. దీంతో సుమ ‘‘ఇక చాలు సర్ దీనిపై ఇక చాలా యూట్యూబ్ వీడియోలు వచ్చేస్తాయి, ఏంటో ఈ మధ్య అందరు హీరోలు నన్ను ఇలాగే సీరియస్ గా చూస్తున్నారు’’ అంటూ చమత్కరించింది. దీంతో అక్కడ ఉన్న వారంత నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ ఎన్టీఆర్ ను తన కొత్త సినిమా ‘ఎన్టీఆర్ 30’ గురించి ఫ్యాన్స్ కు చెప్పాలని కోరింది. ఆ సమయంలో ఎన్టీఆర్ యాంకర్ సుమ వైపు సీరియస్ లుక్ ఇచ్చారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ విషయాన్నే యాంకర్ సుమ ఇక్కడ చమత్కరించింది. అయితే సుమ కామెంట్ పై మళ్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైయ్యాయి. కొంతమంది సుమకు సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే. కొంతమంది మాత్రం ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. అంతేకాని దెప్పిపొడవకూడదు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు ఈ విషయంపై అసలు చర్చలు అనవసరం అంటూ స్పందిస్తున్నారు. ఏదేమైనా సుమ మళ్లీ ఆ సంఘటనను గుర్తుచేసి మరీ కౌంటర్ ఇవ్వడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Read Also: ‘బాహుబలి’ ఆడిషన్‌లో రాశీ ఖన్నా - రాజమౌళికి నచ్చినా, ఆ కారణంతో ఛాన్స్ ఇవ్వలేదట!